తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మృణాల్ ఠాకూర్​కు సూపర్ ఆఫర్​ - ఆ ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరితో! - mrunal thakur ajith movies

Mrunal Thakur Kollywood Offers : మృణాల్ ఠాకూర్​కు మరో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ భామ ఏ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి..

Etv Bharat
మృణాల్ ఠాకూర్ - ఆ ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరితో!

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 10:02 AM IST

Updated : Feb 17, 2024, 10:47 AM IST

Mrunal Thakur Kollywood Offers : ఓవర్ నైట్​లో స్టార్ స్టేటస్​ అందుకున్న వారు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ డార్క్​ చాక్లెట్​ ముద్దుగుమ్మ టాలీవుడ్​లో ఒకే ఒక్క చిత్రంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో స్థానం సంపాదించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సీతామహాలక్ష్మీగా అద్భుతంగా నటించిన ఈ భామ ఆ తర్వాత హాయ్ నాన్న చిత్రంతో మరో సక్సెస్​ను ఖాతాలో వేసుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది.

అలా ఆచితూచి మరీ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఈ భామ బాలీవుడ్​లోనూ బానే సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్​లోనే కాకుండా కోలీవుడ్​లోనూ జోరు చూపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఈ చిన్నదికి మరో రెండు పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన నటించే ఛాన్స్ అందుకుందని అంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.

అజిత్‌ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా విడాముయర్చి. లైకా పిక్చర్స్‌ బ్యానర్​ నిర్మిస్తున్నారు. మగిల్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్​గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత అజిత్‌ - మార్క్‌ ఆంటోని చిత్రం ఫేమ్‌ ఆదిక్‌ రవిచంద్రన్​తో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ నిర్మించనున్నట్లు సమాచారం అందింది.

ఇందులోనే అజిత్‌ సరసన మృణాల్ ఠాకూర్ నటించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలానే మరో తమిళ హీరో శివ కార్తికేయన్‌ - ఏఆర్‌ మురుగదాస్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాలోనూ మృణాల్ ఠాకూర్​కు అవకాశం వచ్చిందని అన్నారు. అయితే ఇది ఇంకా కన్ఫామ్ కాలేదంట. ఇంక శింబు హీరోగా కమల హాసన్‌ నిర్మిస్తున్న సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ పేరే గట్టిగా వినిపిస్తోంది.

మరి ఈ అమ్మడు అజిత్‌కు ఓకే చెబుతుందా లేదా శింబుకు సై అంటుందా? లేదా ఇద్దరితో కలిసి జత కడుతుందా అనే తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇకపోతే అజిత్‌ మూవీటీమ్​ మరో ఛాయిస్ కూడా చూస్తోందట. మృణాల్ ఠాకూర్​ మిస్ అయితే బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని తీసుకోవాలని అనుకుంటుందట. ప్రస్తుతం అన్నీ చర్చల దశలో ఉన్నాయట. ఇప్పటికే ఈ నాజూకు ముద్దుగుమ్మ సూర్య కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల లాస్ అయినా ఆ​ ​ హీరోతో రూ. 600 కోట్ల మూవీ​

'నా సామి రంగ' - ఈ వీకెండ్​లో మొదలైపోయిన మన్మథుడి మాస్ జాతర

Last Updated : Feb 17, 2024, 10:47 AM IST

ABOUT THE AUTHOR

...view details