Mrunal Thakur Investment :'సీతారామం' సినిమాతో తెలుగు తెరకు పరిచమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తొలి సినమాతోనే సౌత్‌లో సూపర్ ఫేమస్ అయ్యిన ఈ చిన్నది ఆ తర్వాత 'హాయ్ నాన్న'తో మరింత పాపులరైంది. ఇందులో తన నేచురల్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో టాలీవుడ్లో వరసు ఆఫర్లు అందుకుని దూసుకెళ్తోంది మృణాల్. ఇందులో భాగంగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో కనిపించనుంది.
భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సందడి చెేస్తోంది. అందులో భాగంగానే మృణాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాతో పాటు తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
తెలుగులో తను హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 'సీతారామం' సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంది. ఆ సినిమాలో యాక్ట్ చేసే సమయానికి తనకు తెలుగు రాదని అయినా ఆ తెలుగు డైలాగులను ఇంగ్షీష్‌లో రాసుకుని ప్రాక్టీస్ చేయడం వలనే ఆ పాత్ర అంత సహజంగా వచ్చిందని తెలిపింది. అయితే తన మాతృ బాష మరాఠిలో కన్నా తెలుగు డైలాగులు చెప్పడం కష్టంగా అనిపించిందని అప్పుడే షూటింగ్లో పక్కన ఉన్న దుల్కర్‌తో ఇదే తన చివరి తెలుగు సినిమా అని చెప్పానని గుర్తు చేసుకుంది. అప్పుడు దుల్కర్ ఆ సినిమా తర్వాత తనకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయంటూ ఎంకరేజ్ చేశారని తెలిపింది. సినిమా విడుదల అయ్యాక అదే నిజం అయిందంటూ మృణాల్ ఆనందం వ్యక్తం చేసింది.