తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

RC 16లో 'మున్నా భయ్యా' కన్ఫామ్​ - అఫీషియల్ అనౌన్స్​మెంట్​ - MUNNA BHAIYA DIVYENNDU SHARMA RC 16

RC 16లో మీర్జాపూర్ యాక్టర్​ - అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్.

RC 16 MIRZAPUR ACTOR MUNNA BHAIYA
RC 16 MIRZAPUR ACTOR MUNNA BHAIYA (source ETV Bharat and Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 12:30 PM IST

RC 16 MIRZAPUR ACTOR MUNNA BHAIYA : మెగా పవర్ స్టార్​ రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు కాంబోలో RC 16 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్​గానే రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభమైంది. అయితే ఈ చిత్రంలో మీర్జాపూర్‌ సిరీస్‌ ఫేమ్‌, మున్నా భయ్యా దివ్యేందు శర్మ భాగమవుతారని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా విషయాన్ని మూవీ టీమ్ కన్ఫామ్ చేసింది.

శనివారం ఉదయం బుచ్చిబాబు ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. "మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్‌కమ్ దివ్యేందు. లెట్స్‌ రాక్‌ ఇట్‌" అని పేర్కొన్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్​ స్పందించి కంగ్రాట్స్‌ చెప్పారు. కాగా, మీర్జాపూర్‌ సిరీస్‌లో మున్నా భయ్యాగా దివ్యేందు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

కాగా, బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఉప్పెన. ఈ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. దీంతో రెండో సినిమాకే మెగా హీరోతో ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి పని చేస్తున్నారు.

స్పోర్ట్స్‌ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రామ్‌ చరణ్‌ పాత్ర పవర్‌ ఫుల్‌గా ఉండనుందని అంటున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్​గా నటిస్తోంది. కన్నడ యాక్టర్​ శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

RC 16 Movie Title :అయితే ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్‌ ప్రచారం సాగుతోంది. రీసెంట్​గా ఈ మూవీ షూటింగ్​ మైసూర్‌లో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌పై కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. అలానే ఇప్పటికే చిత్రానికి సంబంధించిన మ్యూజిక్‌ వర్క్స్‌ ప్రారంభం అయ్యాయని, రెండు సాంగ్స్​ కూడా పూర్తి చేశానని రెహమాన్‌ రీసెంట్​గానే చెప్పారు.

మీర్జాపూర్ మున్నా భయ్యా సినీ కష్టాలు - రూ.32 కోసం హోటల్​లో వర్కర్​గా! - Divyendu Sharma

'మూడు నెలలు అన్నం తినలే - ఆ రోజు చనిపోవాలనుకున్నా' : రాజేంద్రప్రసాద్

ABOUT THE AUTHOR

...view details