తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నెల తిరగకుండానే ఓటీటీలోకి! - 'మేరీ క్రిస్మస్'​ స్ట్రీమింగ్ ఎప్పుడంటే ? - మెర్రీ క్రిస్మస్ డిజిటల్ పార్ట్​నర్

Merry Christmas OTT Release : విజయ్​ సేతుపతి, కత్రినా కైఫ్​ లీడ్​ రోల్స్​లో వచ్చిన 'మేరీ క్రిస్మస్​' మూవీ త్వరలో ఓటీటీకి రానుందట. ఇంతకీ ఎక్కడంటే ?

Merry Christmas OTT Release
Merry Christmas OTT Release

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 11:04 AM IST

Updated : Jan 24, 2024, 2:44 PM IST

Merry Christmas OTT Release : కోలీవుడ్​ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, క‌త్రినా కైఫ్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్​ ' క్రిస్మ‌స్' పాన్ఇండియా లెవెల్​లో సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ఈ మూవీ రిలీజైంది. భారీ అంచ‌నాల న‌డుమ థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఈ మూవీ కలెక్షన్ల పరంగా జోరందుకోలేకపోయింది. అయిన్పపటికీ ప్రశంసలు అందుకుని థియేటర్లలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఓటీటీకి సంబంధించిన వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఈ మూవీ థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే డిజిటల్​ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 60 కోట్ల‌కు కొనుగోలు చేసుకుందట. ఈ క్రమంలో థియేట‌ర్ల‌లో విడుదలైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాత‌ల‌తో నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స‌మాచారం. అలా ఫిబ్ర‌వ‌రి 9 లేదా 16 నుంచి మెర్రీ క్రిస్మ‌స్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్​ అయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌నున్నారట.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే - బాలీవుడ్​లో సూపర్ హిట్​ టాక్ అందుకున్న 'అందాధున్​'ను చిత్రీకరించిన శ్రీ రామ్​ రాఘవన్​ ఈ సినిమాను తెరకెక్కించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా వచ్చిన ఈ చిత్రం 'బ‌ర్డ్ ఇన్ ఏ కేజ్' అనే ఫ్రెంచ్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కింది. ఇందులో విజయ్​ సేతుపతి, కత్రినా కైఫ్​తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.

మరోవైపు 'మేరీ క్రిస్మ‌స్' సినిమాతోనే విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయాల్సింది. ఆయన హిందీలో అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ ఇదే. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో మేరీ క్రిస్మ‌స్ మూడో సినిమాగా రిలీజైంది. ఈ ఏడాది 'ముంబైక‌ర్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు విజ‌య సేతుప‌తి.

Last Updated : Jan 24, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details