తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగాస్టార్ @ 50ఏళ్లు- నట ప్రస్థానంలో చిరు అరుదైన ఘనత - CHIRANJEEVI 50 YEARS

మెగాస్టార్ కెరీర్​లో అరుదైన మైలురాయి- నట ప్రస్థానంలో 50ఏళ్లు పూర్తి- స్పెషల్ ఫొటో షేర్ చేసిన చిరు

Chiranjeevi Konidela
Chiranjeevi Konidela (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 3:05 PM IST

Chiranjeevi 50 Years :మెగాస్టార్ చిరంజీవి కెరీర్​లో మరో అరుదైన మైలురాయి అందుకున్నారు. నట ప్రస్థానంలో ఆయన శనివారంతో 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తన నట ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన డిగ్రీ చదువుతున్న రోజుల్లో 'రంగస్థలం' మీద వేసిన తొలి నాటకానికి సంబంధించిన ఫొటో ఒకటి షేర్ చేశారు.

'రాజీనామా' Y N M College నర్సాపూర్​లో 'రంగస్థలం' మీద తొలి నాటకం. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు. అది ఉత్తమ నటుడు కావడం, ఎనలేని ప్రోత్సాహం. 1974 - 2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం, ఎనలేని ఆనందం! ' అంటూ పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చారు.

90'ల్లో నుంచే బ్లాస్​బస్టర్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి తెలుగు సినిమాపై ముద్ర వేశారు. ఆయన సినీ కెరీర్​లో ఇప్పటివరకు 150+ చిత్రాల్లో నటించి అనేక అవార్డులు దక్కించుకున్నారు. 60ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలతో హుషారుగా స్టెప్పులేస్తూ, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యం కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం చిరు 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉన్నారు. 'బింబిసార' ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ బ్యాక్​డ్రాప్​తో ఇది తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్​తో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. రీసెంట్​గా దసరా సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్​ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే సినిమాలో రెండు సాంగ్స్​ షూటింగ్ మినహా చిత్రీకరణ అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మొదట భావించారు. కానీ, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్​కు సంబంధించి పనుల ఆలస్యం వల్ల సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్​లు లేవు!

కాగా, ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష, ఆషిక రంగనాథ్​ నటిస్తున్నారు. మరో ముగ్గురు హీరోయిన్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్నో అంచనాలు రానున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'విశ్వంభర' వాయిదాకు కారణం అదే- గేమ్​ఛేంజర్ కాదట!

దసరా ట్రీట్​​ - అంతకుమించి అనేలా 'విశ్వంభర' విజువల్ వండర్​ టీజర్​

ABOUT THE AUTHOR

...view details