Chiranjeevi Guinness Record :మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్ చిరంజీవికి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఈ ఈవెంట్ జరిగింది.
కాగా, మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్‌గా చిరంజీవి ఎంపికయ్యారు. 156 సినిమాల్లో 537 పాటలు, 24 వేల డ్యాన్స్ మూమెంట్స్‌కు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది. ఇక కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె సుష్మిత, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు అశ్వినీ దత్, అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు.
ఇది ఊహించనిది
గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు ఎప్పుడూ ఊహించలేదని చిరంజీవి అన్నారు. ఇది తనకు ఎంతో గౌరవం అని అవార్డు అందుకున్న అనంతరం చిరు తెలిపారు. 'గిన్నిస్‌బుక్ రికార్డ్స్ నేను ఎప్పుడూ ఊహించనిది. ఎప్పుడూ ఊహించని గౌరవం నాకు ఇవాళ దక్కింది. దీనికి కారకులైన నా దర్శక, నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు అభిమానులకు ధన్యవాదాలు. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించిందా అనిపిస్తోంది. నటనకంటే ముందే నేను డ్యాన్స్‌కు శ్రీకారం చుట్టాను. చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాటలకు డ్యాన్స్ చేసి అందరిని అలరించేవాడిని' అని చిరు అన్నారు.