Ram Charan 256 Feet Cut Out :గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. 2025 జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్ (గేమ్ ఛేంజర్ లుక్) కటౌట్ ఏర్పాటు చేశారు.
చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాదాపు వారం రోజులు శ్రమించి ఈ కటౌట్ రూపొందించారని అభిమానులు తెలిపారు. దేశంలో ఇదే అతి పెద్ద కటౌట్ అని మెగా ఫ్యాన్స్ చెప్పారు. కాగా, ఆదివారం సాయంత్రం ఇదే గ్రౌండ్స్‌లో స్పెషల్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు సహా, గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ హాజరుకానున్నట్లు తెలిసింది.
ట్రైలర్ అప్పుడే
ఇటీవల మేకర్స్ అమెరికాలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అక్కడ మంచి స్పందన లభించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఈ కార్యక్రమంలోనే ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఓ చోట 2025 జనవరి 4న ఈ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కానీ, దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.