దశాబ్దకాలంగా(2014 నుంచి 2024) ఎక్కువ ప్రజాదరణ పొందిన సినీ తారల జాబితాను ఐఎండీబీ రీసెంట్‌గానే రిలీజ్ చేసింది. అయితే ఈ జాబితాలో ఆరు సినిమాలు చేసి ఒకే ఒక్క హిట్(సోలో హిట్ కాదు) అందుకున్న హీరోయిన్ కూడా నిలవడం విశేషం. స్టార్ హీరోయిన్లు తమన్నా, నయనతారల కన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్న నటిగా చోటు దక్కించుకుంది. టాప్ 100లో 15వ పొజిషన్ దక్కించుకుంది. ఆమెనే త్రిప్తి దిమ్రీ.
30 ఏళ్ల ఈ బ్యూటీ 15వ స్థానంలో నిలవగా దీపికా పదుకొణె, షారూక్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌లు టాప్ 1, 2, 3 పొజిషన్లలో చోటు దక్కించుకున్నారు. వాస్తవానికి త్రిప్తి దిమ్రి 2017లోనే పాస్టర్ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లైలా మజ్ను, బుల్బుల్, ఖాలా లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.
కానీ యానిమల్ మాత్రం ఈ ముద్దుగుమ్మ లైఫ్‌ను ఛేంజ్ చేసేసింది. ఈ సినిమాలో ఆమె నటించింది సెకండ్ హీరోయిన్గా మాత్రమే. కానీ ఆమె అందానికి, పెర్ఫామెన్స్‌కు యువత ఫిదా అయిపోయారు. అలా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు సినీ ఛాన్స్‌లు కూడా ఎక్కువయ్యాయి. ఈ పాపులారిటీతోనే తమన్నా, రణబీర్ కపూర్, నయనతార, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్లను వెనక్కు నెట్టి మరీ ఐఎండీబీ తాజా జాబితాలో దూసుకెళ్లింది.