40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం చేసి దాదాపు 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు ఆయన. తన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. భాషతో సంబంధం లేకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. బీటౌన్లోనే మోస్ట్ వాంటెడ్ నటుడిగా గుర్తింపు పొందారు. అయితే కెరీర్ తొలి నాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూమ్‌కి అద్దె కట్టలేక రాత్రి పూట రైల్వే స్టేషన్లలో నిద్రపోయిన అనుభవాలు ఉన్నాయట. ఇంతకీ ఆయన ఎవరంటే?
అమ్మకు ఆ అబద్దం చెప్పి!
బాలీవుడ్‌లోని బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అనుపమ్ ఖేర్ ఒకరు. ఆయన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తనకు 9వ తరగతి చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. యాక్టింగ్ కోర్సులో చేరడం కోసం తన తల్లికి అబద్దం చెప్పి మరీ రూ.100 తీసుకున్నానని అన్నారు. ఆ తర్వాత డబ్బుల్లేక రైల్వే స్టేషన్లలో నిద్రపోయానని వెల్లడించారు.
ముంబయికి మారిన మకాం
సినిమా అవకాశాల కోసం అనుపమ్ ఖేర్ చండీగఢ్ నుంచి ముంబయికి మకాం మార్చారు. అక్కడ డ్రామా స్కూల్లో టీచర్‌గా పనిచేశారు. అయినప్పటికీ నాటకాలను వదలలేదు. అయితే రూమ్‌కి అద్దె కట్టె స్తోమత లేక బీచ్‌లలో ఒక్కొసారి ఉండేవారట. రాత్రివేళ్లల్లో రైల్వే ప్లాట్ ఫామ్‌లపై పడుకునేవారని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.