తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

5 సినిమాల్లో ఒక్కటే హిట్‌ - 'విక్టరీ' జోడీగానైనా మీనాక్షి విజయం అందుకుంటుందా?

కెరీర్​లో హై అండ్ లో చూస్తున్న మీనాక్షి - ఏడాది వచ్చిన ఐదు సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్- ఏమైందంటే?

Meenakshi Chaudhary
Meenakshi Chaudhary (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 4:30 PM IST

Meenakshi Chaudhary Tollywood Movies : సినిమాల్లో అందం, అభినయమే కాదు కొన్నిసార్లు లక్​ కూడా కీలక పాత్ర పోషిస్తుంటుంది. తాజాగా నటి మీనాక్షి చౌదరి ఆ ఆఖరి పాయింట్​లో కాస్త తడబడుతున్నారు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నా, ఆమెకు సరైన హిట్ మాత్రం దక్కట్లేదు. కెరీర్ ప్రారంభంలోనే అడవి శేష్ మూవీ 'హిట్: ది సెకండ్ కేస్'తో పెద్ద విజయాన్ని సాధించారు ఈ అందాల ముద్దుగుమ్మ. అలా మొదటి సినిమాతోనే సినీ ప్రేక్షకులు, నిర్మాతల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్స్‌లు వచ్చినా ఒకే ఒక్క విజయంతో సరిపెట్టుకున్నారు.

2024 ప్రారంభంలో త్రివిక్రమ్‌- మహేశ్‌ బాబు సినిమా 'గుంటూరు కారం'లో మీనాక్షి ఓ చిన్న పాత్రలో కనిపించారు. అయితే భారీ అంచానల మధ్య వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలే విజయం అందుకోలేదు. చిన్న పాత్ర అయినా సరే ఒప్పుకొన్న మీనాక్షి చౌదరికి తగిన ఫలితం దక్కలేదు. కానీ ఈ మూవీ తర్వాత మీనాక్షి వరుస అవకాశాలు పొందారు. ఈ ఏడాదిలో ఇప్పటికే ఆమె నటించిన ఐదు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. ఇన్ని అవకాశాలు మరే హీరోయిన్‌కి రాలేదు. అయితే అన్ని సినిమాల్లోనూ ఒక్కటి మాత్రమే హిట్ అయ్యింది.

దుల్కర్‌ సినిమాతో విజయం
దళపతి విజయ్ సరసన 'గోట్​'లో యాక్ట్‌ చేశారు మీనాక్షి. అయితే ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ, స్టోరీ పరంగా తెలుగు ఆడియెన్స్​ను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్​తో 'లక్కీ భాస్కర్'లో నటించారు. ఈ సినిమా సక్సెస్‌ సాధించడమే కాకుండా మీనాక్షి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యగా మీనాక్షి తన అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ సక్సెస్​తో ఇక అంతా మంచే జరుగుతుంది అని అనుకునేలోపు ఆ తర్వాత వచ్చిన వరుణ్‌ తేజ్‌ 'మట్కా', విశ్వక్‌ సేన్‌ 'మెకానిక్ రాకీ' ఆడి ఆకట్టుకోలేకపోయాయి. అలానే ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమె నటించిన తమిళ సినిమా ‘సింగపూర్ సెలూన్’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

మొత్తంమీద మీనాక్షి 2024లో ఒకే ఒక్క పెద్ద హిట్‌ని సాధించారు. ఈ ఏడాది కొన్ని బడా సినిమా అవకాశాలు పొందినా విజయం లభించలేదు. 2025 ప్రారంభంలో కూడా మీనాక్షి చౌదరి అదృష్టం పరీక్షించుకోనున్నారు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ జోడీగా చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ జనవరిలో రిలీజ్‌ కానుంది. కొత్త ఏడాది మీనాక్షి విజయం అందుకోవాలని ఆమె ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

స్టార్ హీరోలపై మీనాక్షి చౌదరి కామెంట్స్​ - ఏమన్నారంటే?

మీనాక్షి చౌదరి ఆన్ డిమాండ్ - 4 సినిమాలు పూర్తి​, మరో 8 రోజుల్లో ఇంకో 2 చిత్రాలతో!

ABOUT THE AUTHOR

...view details