తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మా పెదనాన్న, బాబాయ్ గురించి మాట్లాడతా- వాళ్లు ఎప్పుడూ నా వెనకాలే!'

మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్- హీరో వరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్- నవంబర్ 14న సిరీమా రిలీజ్

Matka Pre Release Event
Matka Pre Release Event (Source: ETV Bharat, Getty Images (Middle))

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 7:26 AM IST

Matka Pre Release Event :మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్​గా నిర్వహించారు. ఈ ఈవెంట్​లో హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్​ విషయాలు షేర్ చేసుకున్నారు.

'16 సంవత్సరాల నుంచి 52 ఏళ్ల వయసు వరకూ సాగిన వాసు అనే వ్యక్తి జీవితమే ఈ సినిమా స్టోరీ. అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ మట్కా కింగ్‌లా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించాం. 'గద్దలకొండ గణేష్‌' తర్వాత కొంచెం కొత్త ప్రయత్నం చేశాను. ఈసారి అందరికీ నచ్చేలా మాస్‌ సినిమా చేయాలనుకున్న సమయంలో కరుణకుమార్‌ కలిసి ఈ కథ చెప్పారు. సినిమా విడుదల తర్వాత ఆయన గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఈ సినిమా థియేటర్లలో పక్కాగా దుమ్ము దులిపేస్తుంది. 'విశాఖపట్నం అంటే సముద్రం గుర్తుకు రావాలి, లేదంటే ఈ వాసుగాడు గుర్తుకు రావాలి' అనే ఓ డైలాగ్ సినిమాలో ఉంటుంది. ఆ డైలాగ్​కు తగ్గట్లే వాసు థియేటర్లో ప్రేక్షకులను మెప్పిస్తాడు.

నా సినిమానే మాట్లాడాలని నమ్మే వ్యక్తిని నేను. మూడు రోజుల కిందట ఈ సినిమా లావణ్యతో మాట్లాడా. మర్నాడు ఉదయం మా అన్నయ్య రామ్‌చరణ్‌ ఫోన్‌ చేశాడు. ఆయన నోరు తెరిచి పది మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. పక్కన కూర్చుని భుజంమీద చేయి వేస్తే అదే నాకు రూ.వందకోట్లు. ఎమోషనల్​గా ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉన్నాడు. ఎప్పుడూ కుటుంబం గురించే మాట్లాడతా అని అనుకోవచ్చు. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు. మా పెదనాన్న, బాబాయ్, మా నాన్న నా వెనకాల ఉన్నారు. నేను ఎక్కడున్నా తనకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటూ సహకారం అందిస్తోంది నా భార్య లావణ్య. ఈ సినిమా కోసం పనిచేసిన సహనటులు, టెక్నీషియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత రెండు సినిమాల విషయంలో నా టార్గెట్‌ మిస్‌ అయ్యా. కానీ, ఈసారి మాత్రం గట్టిగా కొడుతున్నా' అని వరుణ్ అన్నారు.

'బన్నీని పెదనాన్న కొట్టేవారు- అల్లు, కొణిదెల కుటుంబాలకు ఆయనే హెడ్​మాస్టర్'

'బాబాయ్ టైటిల్ వాడినందుకు వణికిపోయా!': వరుణ్​ తేజ్​

ABOUT THE AUTHOR

...view details