Mathu Vadalara Who Is Riya :'రియా' ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 'రియా ఎక్కడ?' అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు రియా ఎక్కడ? అనే హ్యాష్‌ట్యాగ్‌తో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే అది రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'మత్తు వదలర 2' సినిమాలోని ఓ పాత్ర పేరు. సినిమాలో ఓ సన్నివేశంలో ఈ రెండు పాత్రల మధ్యలోని ఈ డైలాగ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతోంది.
ఈ సినిమాలో చాలా కామెడీ సీన్లు ఉన్నాయి. అన్నింటికీ మించి మూవీలో సత్య, అజయ్ మధ్య జరిగే ఓ సన్నివేశం ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఇందులో రియా అనే అమ్మాయి కోసం సత్య, అజయ్‌ని ప్రశ్నిస్తాడు.ఇందులో సత్య ప్రశ్నలు, అందుకు అజయ్ చెప్పే సమాధానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సీన్ ఆధారంగా చాలా మంది రియా ఎక్కడ? అనే ట్యాగ్‌తో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
స్పందిచిన నటి
అయితే ఈ సోషల్ మీడియా మీమ్స్‌కు సినిమాలో రియా పాత్ర పోషించిన నటి ఈషా యాదవ్ స్పందించింది. ఆమె కూడా ఈ మీమ్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. 'రియా ఇదిగో' అంటూ సినిమాలోని ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.