తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శ్రీ సింహా, సత్య అదిరిపోయే కామెడీ టైమింగ్ - 'మత్తు వదలరా' ట్రైలర్ చూశారా? - MATHU VADALARA 2 TRAILER - MATHU VADALARA 2 TRAILER

Mathu Vadalara 2 : శ్రీసింహా, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్​టైనర్ 'మత్తు వదలరా' నుంచి మేకర్స్ ఓ ఫన్​ లోడెడ్ ట్రైలర్​ను విడుదల చేశారు. ఆ విశేషాలు మీ కోసం.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 12:36 PM IST

Mathu Vadalara 2 Trailer :యంగ్ హీరోశ్రీసింహా లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ చిత్రం 'మత్తు వదలరా 2'. దీనికి ముందు వచ్చిన ఫస్ట్ పార్ట్ మంచి సక్సెస్​ అందుకోగా, ఇప్పుడు దీని సీక్వెల్ కూడా ఓ రేంజ్​లో ఆకట్టుకునేలా సిద్ధమైంది. తాజాగా వచ్చిన టీజర్​కు వచ్చిన విశేష స్పందన, అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్​లో మూవీ టీమ్​ స్పాన్​టేనిటీ మూవీ లవర్స్​ను ఆకట్టుకుంటోంది.

తాజాగా మేకర్స్​ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​ను రెబల్​ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ ట్రైలర్ ప్రస్తతుం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా టీజర్​లో మేకర్స్ ఇచ్చిన మీమ్​ స్టఫ్​ ఇక్కడ కూడా ఆడియెన్స్​ను ఆకట్టుకుటోంది. హీరో శ్రీసింహా, హాస్య నటుడు సత్య కామెడీ టైమింగ్​ ట్రైలర్​కే హైలైట్​గా నిలిచింది.

ఇక ఈ 'మత్తు వదలరా 2' సినిమా విషయానికి వస్తే, శ్రీసింహా హీరోగా రానున్న ఈ చిత్రంలో సత్య, రితేశ్‌ రానా, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్​, రోహిణి, సునీల్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే మూవీ టీమ్​ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ ఫరియా ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.

"నేను వర్క్‌ చేసిన టీమ్‌లలో ఇది బెస్ట్. ఈ మూవీ షూటింగ్ ఎంతో సరదగా జరిగింది. ఈ చిత్రం కోసం నేను ఓ పాట రాశాను. దాన్ని నేనే పాడి కొరియోగ్రఫీ చేశాను. అది చాలా కొత్తగా ఉంటుంది. ఎంజాయ్‌ చేస్తారు" అంటూ ఫరియా అన్నారు.

ఇక శ్రీ సింహా సోదరుడు కాలభైరవ కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. "మత్తు వదలరాటతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. 5 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్‌కు వర్క్‌ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఫస్ట్‌ పార్ట్‌కు థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు దీని సీక్వెల్‌ను అలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను." అని కాలభైరవ పేర్కొన్నారు.

రివ్యూ: 'మ‌త్తు వ‌ద‌ల‌రా'లో మత్తెక్కింది ఎవరికి?

'ఓ కంప్యూటర్.. రెండు హార్డ్​డిస్క్​లతో సినిమా పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details