March 2024 OTT Release Movies List : ఫిబ్రవరి నెల ముగియడంతో ఇక మార్చి నెలపై కన్నుపడింది ఓటీటీ మూవీ లవర్స్‌కు. అయితే ఇప్పుడు సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్. ఈ మార్చి నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5 లాంటి ఓటీటీల్లో హనుమాన్, మహారాణి 3, ఫైటర్ లాంటి ఆసక్తికరమైన సినిమా, సిరీస్‌లు వచ్చేందుకు రెడీ అయ్యాయి. మరి ఏ సినిమా, సిరీస్‌లు ఎప్పుడు, ఎక్కడ రాబోతున్నాయో తెలుసుకుందాం.
- ఈ ఏడాది మొదట్లోనే ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం హనుమాన్. అతి తక్కువ రూ.30కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.250కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ ఒక్కోక్కటిగా ఓటీటీల్లోకి రాగా హనుమాన్ ఒక్కటే ఆలస్యంగా మార్చి 2న రాబోతుంది. జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
- మాస్ మహారాజా రవితేజ నటించి భారీ చిత్రం ఈగల్ రీసెంట్గా రిలీజై మంచి హిట్ అందుకుంది. రవితేజను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. మార్చి 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.
- గురు ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ వళరి(Valari). శ్రీరామ్ కీలక పాత్రధారి. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ఈటీవీ విన్ లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- జీ5లో గతంలో వచ్చిన సన్ ఫ్లవర్ వెబ్‌సిరీస్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇప్పుడు కొత్త సీజన్ రాబోతోంది. ఈ సీజన్ 2 మార్చి 1 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.
- మహారాణి సిరీస్ తొలి రెండు సీజన్లకు విశేష ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 7 నుంచి ఈ సిరీస్ కొత్త సీజన్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది.