Manjummel Boys PVR Multiplex :ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.230 కోట్లు సాధించిన తొలి మలయాళ చిత్రంగా రికార్డుకెక్కింది(Manjummel Boys Collections). అయితే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను మైత్రి మూవీస్ ఏప్రిల్ 6న విడుదల చేసింది. తెలుగు వెర్షన్ కూడా విజయవంతంగా ప్రదర్శన అవుతోంది. అయితే ఈ సినిమా నిర్మాతలతో పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు మధ్య గొడవలు తలెత్తడంతో ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను పీవీఆర్ మల్టిప్లెక్స్ గురువారం అర్ధాంతరంగా నిలిపేసింది.
ఈ విషయంపై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి నిర్మాతల మండలిని ఆశ్రయించారు. మలయాళ సినిమా నిర్మాతతో గొడవ కారణంగా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న తెలుగు వెర్షన్ ను ఆపేయడం సరైన నిర్ణయం కాదని ఆరోపించారు. న్యాయం కోసం నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై ఒక తీర్పు చెప్పేందుకు నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశం కానుంది. పీవీఆర్ మల్టిప్లెక్స్‌కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలో కూడా ఎన్నో సినిమాల విషయంలో నిర్మాతలతో గొడవలు జరిగాయి. అయితే ఒక భాషలో నిర్మాతతో గొడవ కారణంగా మరొక భాషలో రన్ అవుతున్న సినిమాను ఆపడం ఇదే మొదటిసారి.
రూ.200 కోట్ల 'మంజుమ్మల్ బాయ్స్'కు బిగ్ షాక్ - పీవీఆర్‌పై మైత్రీ మూవీస్ ఆగ్రహం! - Manjummel Boys - MANJUMMEL BOYS
Manjummel Boys PVR Multiplex : రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అందుకున్న మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ప్రదర్శనలను పీవీఆర్ మల్టిఫ్లెక్స్ నిలిపివేసింది. పూర్తి వివరాలు స్టోరీలో.
రూ.200 కోట్ల 'మంజుమ్మల్ బాయ్స్' నిలిపివేత - గొడవకు దిగిన మైత్రీ మూవీస్!
Published : Apr 11, 2024, 3:42 PM IST
|Updated : Apr 11, 2024, 4:18 PM IST
Last Updated : Apr 11, 2024, 4:18 PM IST