Mahesh Babu Son Gowtham Ghattamaneni : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత దంపతుల పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్స్‌గా సితార, గౌతమ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరిలో సితార సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ గౌతమ్ తక్కువగానే ఉంటాడు. కెమెరా ముందుకు ఎక్కువగా రాడు. నెట్టింట్లోనూ తక్కువగా పోస్ట్‌లు చేస్తుంటాడు. అయితే తాజాగా అతడు తన లేటెస్ట్ పిక్స్‌ను పోస్ట్ చేసి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే - అప్పుడెప్పుడో మహేశ్ నటించిన 1 – నేనొక్కడినే సినిమాలో మహేశ్ బాబు చైల్డ్ హుడ్ క్యారెక్టర్లో గౌతమ్ కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో ఆ తర్వాత కూడా గౌతమ్ వరుసగా సినిమాలలో కనిపిస్తాడని అందరూ ఆశించారు. ఎందుకంటే ఒకప్పుడు మహేశ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే పలు సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే మహేశ్ కూడా తన కొడుకు విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. గౌతమ్ పూర్తిగా స్టడీస్‌పైనే ఫోకస్ పెట్టాడు. విదేశాల్లో చదువుకుంటున్నాడు. అలానే ఎక్స్ట్రా యాక్టివిటీస్‌లోనూ చురుగ్గానే పాల్గొంటున్నాడు గౌతమ్. ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా మారి మెడల్స్ కూడా సంపాదించాడు.
ఆ మధ్యలో తన స్కూల్ డ్రామా కాంపిటీషన్లోనూ పాల్గొని మహేశ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపాడు. అలా అని సినిమాల్లో కనిపించలేదు. చదువులపైనే దృష్టి పెట్టాడు. రీసెంట్‌గానే అతడు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. దీంతో మహేశ్ పుత్రోత్సాహంతో పొంగిపోతూ సోషల్ మీడియోలోనూ పోస్ట్ చేశాడు.