తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రానున్న మరో భారీ ప్రాజెక్ట్‌! - పాన్ ఇండియా లెవెల్​లో 'మహావతార్‌ నరసింహ' - MAHAVATAR NARSIMHA HOMBALE FILMS

'మహావతార్‌ నరసింహ' - హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రానున్న మరో భారీ ప్రాజెక్ట్‌ ఇదే!

Mahavatar Narsimha
Mahavatar Narsimha (Source : Film poster)

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 6:13 PM IST

Mahavatar Narsimha Hombale Films :ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తాజాగా ఓ సరికొత్త ప్రాజెక్ట్​ను అనౌన్స్ చేసింది. అశ్విన్‌ కుమార్‌ డైరెక్షన్​లో 'మహావతార్‌: నరసింహ' అనే సినిమాను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. అయితే ఇందులో నటించేవారి గురించి అలాగే టెక్నికల్ టీమ్ గురించి త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందించనున్నారు. కుశాల్‌ దేశాయ్‌, శిల్పా ధావన్‌, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే 'మహావతార్‌' సిరీస్‌లో రానున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ఇతర అవతారాలతో చిత్రాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్పింది.

ఇక హోంబలే ఫిల్మ్స్‌ విషయానికొస్తే ఇప్పటికే ఈ సంస్థ ఎన్నో విజయవంతమైన చిత్రాలను సినీ పరిశ్రమకు అందించింది. త్వరలో 'కాంతార','సలార్‌' సీక్వెల్స్​ కూడా ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్నాయి. రిషభ్‌శెట్టి కీలక పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'కాంతార: చాప్టర్‌1' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. తొలి భాగానికి ప్రీక్వెల్‌గా రానున్న ఈ చిత్రం భారీ హంగులతో రూపుదిద్దుకుంటోంది.

ఇదిలా ఉండగా, ప్రభాస్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కనున్న 'సలార్‌: శౌర్యంగ పర్వం' షూటింగ్‌ కూడా రీసెంట్​గానే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు ప్రభాస్‌తో మరో రెండు సినిమాలను చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ హర్షం వ్యక్తం చేసింది.

"భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా ఓ మూడు సినిమాల భాగస్వామ్యంలో ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ సినిమాటిక్‌ అనుభూతిని సృష్టించాలనే మా నిబద్ధతకు సంబంధించిన ప్రకటన ఇది. దీనికి వేదిక సిద్ధమైంది. ముందుకుసాగే మార్గం మాత్రం అపరిమితంగా ఉంటుంది. #Salaar2 తో మా ఈ ప్రయాణం ప్రారంభం కానుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి" అంటూ తాజాగా పేర్కొంది. 'ది హోంబలే ఈజ్‌ కాలింగ్‌ ప్రభాస్‌' అనే క్యాప్షన్​ను జోడించింది. ఇక 2026, 2027, 2028ల్లో ఈ సినిమాలు ఉండనున్నట్లు చెప్పింది. అయితే 'సలార్‌ 2' తప్ప మిగిలిన ప్రాజెక్టులు ఏంటి అనే విషయాల గురించి నిర్మాణ సంస్థ ఇంకా ఎటువంటి విషయం తెలియజేయలేదు.

'కాంతార 2' సెట్స్​లో రిషభ్​ - 60రోజులు నాన్​స్టాప్ షూటింగ్!

ప్రభాస్ బిగ్ డీల్​ - ఆ బడా నిర్మాణ సంస్థతో మూడు ప్రాజెక్ట్​లు ఖరారు

ABOUT THE AUTHOR

...view details