Maharshi Raghava Chiranjeevi :టాలీవుడ్నటుడు 'మహర్షి' రాఘవను మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్‌లో రాఘవ తాజాగా 100వ సారి రక్తదానం చేశారు. ఇది తెలుసుకున్న చిరు, ఆయన గొప్ప మనసును మెచ్చుకునేందుకు తన ఇంటికి పిలిచారు. ఆప్యాయంగా పలకరించి రాఘవను సన్మానించారు. మహర్షి రాఘవను ఇన్స్పిరేషన్గా తీసుకుని అందరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
"మహర్షి రాఘవ మా బ్లడ్ బ్యాంక్‌లో ఇప్పటి వరకు వందసార్లు రక్తదానం చేశారు. ఓ వ్యక్తి అన్నిసార్లు రక్తం ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా నేను ఆయన్ను మా ఇంటికి ఆహ్వానించి ఇలా సన్మానించడం నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది. నిజంగా ఆయన చాలా గ్రేట్. మేము బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించినప్పుడు అందులో తొలిసారితి మురళీ మోహన్ రక్తదానం చేశారు. అదే రోజు రాఘవ కూడా బ్లడ్ డొనేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి ఒక్కరికి ఆయన ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఆయన చేస్తున్న ఈ పని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి సమయానికి రక్తం అందుతుంది" అంటూ రాఘవను మెచ్చుకున్నారు. మురళీ మోహన్ సైతం ఇదే వేదికగా రాఘవను ప్రశంసించారు.
ఇక మహర్షి రాఘవ 90స్లో హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో మెరిశారు. 'చిత్రం భళారే విచిత్రం', 'న్యాయం కోసం', 'జంబలకిడిపంబ', 'నెంబర్ వన్', 'శుభాకాంక్షలు' లాంటి సినిమాల్లో తనదైన శైలీలో నటించి మెప్పించారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన 2007లో ఆఖరిగా సినిమాల్లో కనిపించారు. అల్లరి నరేశ్ లీడ్ రోల్లో వచ్చిన 'అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ' సినిమాలో కీలక పాత్ర పోషించారు.