lucky Bhaskar Box Office Collection :దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి కానుకగా అక్టోబరు 31న థియేటర్లలో రిలీజైన చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. టాక్ కూడా బాగా రావడం వల్ల ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. ఇదే తరుణంలో సినిమా గురించి వచ్చిన రీసెంట్ అనౌన్స్‌మెంట్ దుల్కర్ ఫ్యాన్స్‌కు మరింత హ్యాపీనెస్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు దక్కించుకోగా, నవంబరు 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్కు రెడీ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. థియేట్రికల్ రన్‌ను బట్టి ఓటీటీలోకి రిలీజ్ చేయడంలో తేదీలు మారే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
లక్కీ భాస్కర్ డే 3 కలెక్షన్స్ ఎంతంటే?
ఓపెనింగ్ డే రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.11 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ.12 కోట్లు, మూడో రోజు రూ.13కోట్లు వసూలు చేసింది. నవంబరు 3 కల్లా రూ.47 కోట్ల నుంచి రూ.51 కోట్ల వరకూ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు నిర్మాతలు. దీపావళి పండుగ రోజున జయమ్ రవి హీరోగా బ్రదర్, శివకార్తీకేయన్ హీరోగా అమరన్, కిరణ్ అబ్బవరం నటించిన కేఏ, కెవిన్ నటించిన బ్లడీ బెగ్గర్ రిలీజ్ అయి చాలా కాంపిటీషన్ ఇచ్చాయి. ఈ సినిమాకు అదే మూవీ యూనిట్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. సినిమా చూసి హను రాఘవపూడి ఇంటిల్లిపాది తెగ మెచ్చేసుకున్నారట. హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా సినిమాను చూడమంటూ సిఫారసు చేస్తుందట.