Laapata Ladies Oscars 2025 :బాలీవుడ్లో క్లాసిక్ హిట్‌గా నిలిచి మూవీ లవర్స్‌ను అలరించిన లాపతా లేడీస్ మూవీ ఇప్పుడు భారత్ తరఫున అధికారికంగా ఎంట్రీకి పంపిస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అయితే 'ఆట్టం', 'యానిమల్' తదితర 29 సినిమాల లిస్టు నుంచి ఈ సినిమాను ఎంచుకున్నారని తెలిపారు.
ఆమె మాట నిజం అయ్యింది
అయితే ఇటీవలే ఇదే విషయంపై ఈ మూవీ డైరెక్టర్ కిరణ్ రావ్ మాట్లాడారు. మన దేశం తరఫున ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్‌కు ఎంపికవుతుందని ఓ ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. "2025లో ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అఫీిషియల్ నామినేషన్‌కు 'లాపతా లేడీస్' అర్హత సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆస్కార్ వేదికపై ఈ సినిమా మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు మా టీమ్ మెంబర్స్ కోరిక. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్‌కు పంపుతుందని నేను ఆశిస్తున్నాను" అంటూ కిరణ్‌రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడీ నామినేషన్స్ అనౌన్స్మెంట్ విన్న మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి ఆమె మాట నిజం అయ్యిందంటూ కామెంట్లు పెడుతున్నారు. టీమ్‌కు కంగ్రాజ్యూలేషన్స్ తెలుపుతున్నారు.
2001 కాలం బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందింది. పల్లెటూరికి చెందిన ఇద్దరు కొత్త పెళ్లి కూతుర్లు తమ అత్తారింటికి వెళ్లే సమయంలో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైపోతారు. ఇది తెలియని పెళ్లికొడుకులు ఆ అమ్మాయిలను ఇంటికి తీసుకెళ్తారు. తీరా చూసుకున్నాక అసలు నిజం బయటపడుతుంది. అయితే ఈ మార్పు వల్ల ఆ ఇద్దరి అమ్మాయిల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందనేదే మిగతా కథ.