Kurchi Madatha Petti Song Record :2024లో సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం'తో సందడి చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ పాట థియేటర్లలో ఆడియెన్స్‌తో స్టెప్పులేయించింది. తాజాగా ఈ పాట మరో అరుదైన ఘనత సాధించింది.
టాప్ సాంగ్స్‌లో చోటు
విడుదలైనప్పటి నుంచే యూట్యూబ్‌లో ఈ పాటకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటిదాకా 526+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ క్రమంలోనే 2024 యూట్యూబ్ మ్యూజిక్‌లో టాప్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని యూట్యూబ్ ట్విట్టర్లో అధికారికంగా తెలిపింది. ఈ లిస్ట్‌లో హాలీవుడ్ స్థాయిలో మొత్తం 8 పాటలు ఎంపికవ్వగా, అందులో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ చోటు దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు పాట సత్తా చాటడం విశేషం.
కాగా, ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సాహితి చాగంటి, శ్రీ కృష్ణ ఆలపించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ఇక హీరో మహేశ్ బాబు- శ్రీలీల పాటకు హుషారైన స్టెప్పులతో ఇరగదీశారు. అటు శ్రీలీలకు కూడా ఈ పాట మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక మహేశ్‌బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. సినిమా అంతా మహేశ్ బాబు వన్ మ్యాన్ షో. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.