Kubera Movie Teaser :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పాన్ఇండియా లెవెల్లో తెరెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'కుబేర'. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతోపాటు హీరో ధనుశ్ నటిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది. శేఖర్ తొలి పాన్ఇండియా మూవీ కావడం, తమిళ, తెలుగు స్టార్స్ కలిసి నటిస్తుండడం వల్ల సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే సినిమా నుంచి స్టార్లు నాగార్జున, ధనుశ్, రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. అలాగే నేషనల్ క్రష్ క్యారెక్టర్ గ్లింప్స్ కూడా విడుదలైంది. రీసెంట్గా మరో కొత్త పోస్టర్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అదే సమయంలో టీజర్ రిలీజ్ డేట్ కూడా చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తేదీన టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ విషయాన్ని గుర్తుచేస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. కొత్త పోస్టర్లో హీరోయిన్ రష్మిక క్యూట్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్లో ఓ బ్రిడ్జ్ ఉంది. దీంతో సినిమాలో ఆమె చాలా సింపుల్‌గా కనిపించనున్నట్లు పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ఎంతో అందంగా కనిపిస్తున్న రష్మిక ఉన్న న్యూ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.