Kriti Sanon Relationship : మహేశ్ 'వన్- నేనొక్కడినే', నాగ చైతన్య 'దోచెయ్', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ తనకన్నా వయసులో చిన్నవాడైన కబీర్ బహియాతో(Kriti sanon Rumour Boyfriend) రిలేషన్షిప్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ విషయమై ఆమె స్పందించింది. డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన రూమర్స్ తనను ఎంతో బాధించాయని చెప్పింది. ఆ రూమర్స్‌ను ఖండించిన ఆమె అవి తన కుటుంబంపై కూడా ప్రభావం చూపినట్లు తెలిపింది.
"నా గురించి తప్పుడు సమాచారాన్ని రాసినప్పుడు నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధపడతారు. దాని వల్ల ఎదురయ్యే పరిణామాలను మేమంతా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి వార్తలైనా సోషల్ మీడియా ద్వారా ఇట్టే త్వరగా ప్రజల్లోకి వెళ్లిపోతాయి. అవి నిజం అనుకుని చాలా మంది నాకు మెసేజ్‌లు చేస్తుంటారు. వీటిపై స్పందించాలంటే ఇబ్బందిగా ఉంటుంది. '34 ఏళ్ల కృతి తన కన్నా 10 ఏళ్ల చిన్న వ్యక్తితో డేటింగ్లో ఉంది' అని ఓ హెడ్డింగ్‌ను ఉపయోగించారు. ఏ మాత్రం అందులో నిజమెంత అని తెలుసుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు రాశారు. ఇలా చేయడం, రాయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. గతంలో సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్ పేపర్స్ చూసి ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఆన్‌లైన్‌లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాసేస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టడం బాగా ట్రెండ్‌గా మారిపోయింది. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, అవతలి వ్యక్తిపై రూమర్స్ క్రియేట్ చేయడం రెండూ ఒకటి కాదు" అంటూ కృతి అసహనం వ్యక్తం చేసింది.