Ajith Kumar About Movies :కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా తన అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలియజేశారు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం రేసింగ్‌పైనే ఉందని, ఆ పోటీలు ముగిసేంతవరకూ తాను సినిమాల్లో నటించనంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట ట్రెండ్ అవ్వగా, అజిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇక ప్రస్తుతం అజిత్ ప్రాక్టీస్ చేస్తున్న కార్ రేసు జనవరి 12న ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా ఈ ఈవెంట్ రెండు రోజుల పాటు జరగనుంది. దీంతో అజిత్ కొద్ది రోజుల క్రితమే అక్కడి చేరుకుని ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో తీవ్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే రీసెంట్గా ఆయన కారు ట్రాక్‌లోని బారికేడ్‌ను చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది. కారు బాగా దెబ్బతిన్నప్పటికీ, అజిత్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కొత్త రేసింగ్ టీమ్!
అయితే అజిత్‌కు రేసింగ్ అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగుల నుంచి బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి మిగతా సమయాన్ని బైక్స్, కార్లతో చక్కర్లు కొడుతుంటూ కనిపిస్తుంటారు. కొన్ని నెలల క్రితం గంటకు 234 కిలోమీటర్ల వేగంతో ఆయన కారును డ్రైవ్ చేశారు. ఆ వీడియో అప్పట్లోనే తెగ వైరల్ అయింది. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కూడా అజిత్ ఓ స్టార్టప్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వరకూ బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే కాకుండా తాజాగా తన రేసింగ్ టీమ్‌ను ప్రకటించారు. 'అజిత్ కుమార్ రేసింగ్' అనే పేరుతో టీమ్‌ను ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర తాజాగా వెల్లడించారు.