తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రూ.50 జీతం నుంచి రూ.1200 కోట్ల సినిమా దాకా- కేజీఎఫ్ యశ్ కెరీర్ జర్నీ మీకు తెలుసా? - KGF Yash Career - KGF YASH CAREER

KGF Yash Career: ఆ నటుడు ఒకప్పుడు 50 రుపాయల వేతనంతో తన కెరీర్ ప్రారంభించారు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఎదిగారు. ఇంతకీ ఎవరా నటుడు తెలుసుకోవాలనుందా? అయితే ఎందుకు ఆలస్యం వెంటనే ఈ స్టోరీ పై ఓ లుక్కేయ్యండి.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 1:15 PM IST

KGF Yash Career: చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ దొరకటం చాలా కష్టం. ఒకవేళ దొరికిన అందులో రాణించటం అంత సాధారణ విషయం కాదు. రజనీకాంత్, షారుక్ ఖాన్, కమల్ హాసన్ లాంటి కొద్ది మంది నటులు మాత్రమే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరో యశ్ కూడా ఈ కోవలోకే వస్తారు. తన రూ.50 వేతనంతో కెరీర్ ప్రారంభించిన యశ్ ప్రస్తుతం రూ.150 కోట్లు పారితోషికంతో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఒకరిగా ఎదిగారు. మరి యశ్ కెరీర్ ప్రయాణం గురించి తెలుసుకోవాలనుందా? మరెందుకు ఆలస్యం వెంటనే ఈ ఆర్టికల్ చదవండి.

1986లో అరుణ్ కుమార్- పుష్ప దంపతులకు జన్మించిన యశ్ అసలు పేరు నవీన్. కొద్దికాలం తరువాత వాళ్ల అమ్మవారి కుటుంబ సభ్యులు యశ్వంత్ అనే పేరు పెట్టారు. అయితే అది కాస్త ఇండస్ట్రీకి వచ్చిన తరువాత యశ్​గా మారింది. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న యశ్ పదో తరగతి వరకూ పూర్తి చేసి తాత్కాలికంగా చదవు కు బ్రేక్ ఇచ్చారు. 16 ఏళ్ల వయసులో కేవలం రూ. 300తో బెంగళూరుకు పయనమయ్యారు. మెుదట ఒక చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్​గా చేరారు.

అయితే అనుకోని కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది. అనంతరం థియేటర్ గ్రూప్​లో బ్యాక్ స్టేజ్ వర్కర్​గా పని చేశారు. ఆ సమయంలో యశ్​కు రోజూ రూ.50 జీతంగా ఇచ్చేవారు. అనంతరం కొద్ది కాలం పాటు ప్రయత్నాలు కొనసాగించిన యశ్ 2004 "గోకుల్ నీల్ కమల" అనే చిత్రంలో లీడ్ రోల్ లో నటించారు. ఒకవైపు పనులు చేసుకుంటూనే తన డిగ్రీ బెంగళూర్​లోని "కే ఎల్ఈ " కాలేజ్​లో పూర్తి చేశారు. సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే 2005లో "ఉత్తరయాన" అనే టీవీ సీరియల్​లోనూ నటించారు. అదేవిధంగా "మలేబిల్లు", "ప్రీతి ఇల్లద మేలీ" అనే టీవీ షో లలో నటించాడు.

ఇక 2007లో "జాంబడ హుడిగీ" అనే చిత్రంలో సపోర్డింగ్ రోల్ పాత్ర చేసిన యశ్, అనంతరం 2008లో "మూగిన మనసు" చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే యశ్ లీడ్ రోల్ లో వచ్చిన "రాకీ" సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. 2009 "కల్లర సంతే" అనే చిత్రంలో యశ్ ఆటో రిక్షా డ్రైవర్ పాత్ర చేశారు. అయితే ఆ చిత్ర ప్రమోషన్​లో భాగంగా రేడియో స్టేషన్​లో ఒక కార్యక్రమం పెట్టి దానిలో విజేతలకు యశ్ డ్రైవర్​గా ఆటోలో బెంగళుర్ ట్రిప్ విజేతగా ప్రకటించారు. అయితే కేవలం ఒక్క విజేతనే బెంగుళూర్ ట్రిప్ తిప్పాల్సి ఉండగా యశ్ మాత్రం ముగ్గురు అమ్మాయిల్ని తిప్పారు. అనంతరం "లక్కీ", "జాను", "గూగుల్", "మిస్టర్", "రామాచారి" చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలు సాధించాయి. దీంతో కన్నడలో మంచి స్టార్ గా యశ్ ఎదిగారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యశ్ పేరు తెలియని వారు ఉండరు. 'కేజీయఫ్' సినిమాలతో యశ్​ దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో ఫ్యాన్స్​ను సంపాదించుకున్నారు. ఈ సినిమాతోనే ఆయన పాన్ఇండియా స్టార్​గా ఎదిగారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ. 1200+ కోట్లు వసూళ్లు సాధించింది.

ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణ చిత్రంలో యశ్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. ఇందులో రణ్​బీర్ కపూర్ రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి యశ్​ రూ.150 కోట్లు పారితోషికం అందుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో యశ్ ఒకరిగా నిలవనున్నారు. అయితే ఈ సినిమా వివరాలు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

రాకీ భాయ్​తో బీటౌన్ బ్యూటీ! - వాట్​ ఏ కాంబో సర్​జీ

బాక్సాఫీస్ కింగే అయినా​ - భార్య కోసం గల్లీలోని కిరాణా కొట్టుకు!

ABOUT THE AUTHOR

...view details