Karthi Arvind Swamy Movie :కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్ స్వామి, యంగ్ హీరో కార్తి ప్రధాన పాత్రల్లో మెరిసిన తాజా చిత్రం 'సత్యం సుందరం' బావ, బావమరిది అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం థియేటర్లో డీసెంట్ టాక్ అందుకుని నడిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇంతకీ స్టోరీ ఏంటంటే
సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి)ది గుంటూరు దగ్గరున్న ఉద్దండరాయుని పాలెం. అతడికి ఆ ఊరన్నా, అక్కడ ఉన్న తమ తాతల కాలం నాటి ఇళ్లన్నా ఎంతో ఇష్టం. అయితే కొందరు బంధువులు చేసిన మోసం వల్ల యుక్తవయసులోనే సత్యం వాళ్ల కుటుంబం ఆ ఇల్లు కోల్పోతుంది. దీంతో వారందరూ ఆ ఊరుని వదిలేసి వైజాగ్ వచ్చి స్థిరపడతారు. అలా 30ఏళ్లు గడిచిపోతాయి. కానీ ఇన్నేళ్లు గడిచినా సత్యంను తన ఊరు, ఇంటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.