Kanata Charpter 1 :కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కాంతార చాప్టర్ -1'. 2022లో రిలీజై భారీ విజయం దక్కించుకున్న 'కాంతార'కు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. 'కాంతార' తొలి పార్ట్‌లో చూసిన కథకు ముందు ఏం జరిగింది? అనేది ఈ 'కాంతార చాప్టర్- 1'లో చూపించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అదేంటంటే?
ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూళ్లలో జరిగింది. తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హీరో రిషభ్ శెట్టి పాల్గొంటారట. నాన్ స్టాప్‌గా 60 రోజులపాటు ఈ షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లోని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించనున్నట్లు సమాచారం.
అయితే కాంతార తొలి భాగాన్ని కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కథంతా అటవీ ప్రాంతం బ్యాక్ డ్రాప్లో తీయడం వల్ల పెద్దగా ఖర్చు అవ్వలేదు. కానీ, ఈ ప్రీక్వెల్ మాత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ 4వ సెంచరీలోదని, రిషభ్ శెట్టి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని ఇన్సైడ్ టాక్. ఇక మూవీకి హైప్ క్రియేట్ అయ్యేలా, వీఎఫ్ఎక్స్ డిజైన్స్ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారట. అందుకనే బడ్జెట్ రేంజ్ పెరిగినట్లు తెలుస్తోంది.