Kannappa Movie Prabhas Shooting :టావీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ ఈ చిత్రీకరణలో పాల్గొని సందడి చేయగా, తాజాగా నటుడు ప్రభాస్ కూడా ఈ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు విష్ణు.
అందులో భాగంగా ప్రభాస్ ఈ షూట్లో పాల్గొన్నారంటూ ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో కాళ్లను మాత్రమే చూపించారు. పాదుకలు, పులిచర్మం ఇలా కొన్ని డీటైల్స్‌ను మాత్రమే చూపించి అభిమానుల్లో మరింత ఇంట్రెస్ట్ పెంచారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాలో ప్రభాస్ రోల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ప్రభాస్ ఈ సినిమాలో శివ భక్తుడైన నందీశ్వరుడిగా కనిపించనున్నారన్న వార్తలు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విషయంపై అధికారిక అప్డేట్ లేదు. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా 'కన్నప్ప' షూటింగ్లో పాల్గొని తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు.
అయితే ఇటీవలే అక్షయ్ 'ఓ మై గాడ్2' సినిమాలో శివుడి పాత్రలో కనిపించారు. ఆయన నటనకు ప్రేక్షకులు బాగా ఎమోషనలయ్యారు. దీంతో 'కన్నప్ప'లోనూ అక్షయ్ అదే పాత్రలో కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్ కూడా జోరుగా సాగిన సంగతి తెలిసిందే.
ఇక 'కన్నప్ప' సినిమాను డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్లో హీరో మంచు విష్ణు మెరవనున్నారు. ఈయనతో పాటు మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, శరత్‌కుమార్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. దాదాపు 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు శ్రమించి ఈ చిత్రానికి సంబంధించిన ఆర్ట్ వర్క్ పూర్తి చేయించినట్లు ఇటీవలే హీరో విష్ణు చెప్పారు. ఈ సినిమా అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు.
'కన్నప్ప'లో ప్రభాస్ పాత్ర - మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదట - ఏ పాత్రలో కనిపించనున్నారంటే? - Prabhas Kannappa