తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

"తమ్ముడంటే జెలస్​ - త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా" - బిగ్​బాస్​లో హీరో సూర్య సందడి! - HERO SURIYA IN BIGG BOSS 8 TELUGU

-బిగ్​బాస్​లో సందడి చేసిన కంగువ టీమ్​ -తెలుగు ప్రేక్షకులకు హీరో సూర్య ప్రామిస్​

Hero Suriya in Bigg Boss 8 Telugu
Hero Suriya in Bigg Boss 8 Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 10:56 AM IST

Hero Suriya in Bigg Boss 8 Telugu: బిగ్​బాస్​ సీజన్​ 8లో శనివారం(అక్టోబర్​ 26) ఎపిసోడ్​లో హీరో సూర్య సందడి చేశారు. 'కంగువా' మూవీ ప్రమోషన్స్​లో భాగంగా బిగ్​బాస్​ స్టేజ్​ మీదకు వచ్చి కంటెస్టెంట్లకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తన బ్రదర్​ కార్తీ విషయంలో జెలస్​గా ఉంటుందని అంటూ.. తెలుగు ప్రజలకు ఓ ప్రామిస్​ చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రామిస్​ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

శనివారం ఎపిసోడ్​లో కంటెస్టెంట్లకు గట్టిగానే వార్నింగ్​ ఇచ్చారు హోస్ట్​ నాగార్జున. ముందుగా మెగా చీఫ్​ అయిన విష్ణుప్రియకు కంగ్రాట్స్​ చెప్పి.. మంచిగా ఆడాలన్నారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్​కు సంబంధించిన కుండ పగలగొట్టి.. వారిలోని తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. ఇక కంటెస్టెంట్ల గురించి చెప్పడం అయిపోయిన తర్వాత హీరో సూర్య తన టీమ్‌తో కలిసి కంగువా సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. ఈ క్రమంలో సూర్యను ఆప్యాయంగా పలకరించారు నాగార్జున..

"మై ఫ్రెండ్.. సూర్య.." అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు నాగార్జున. ఇక "ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత.. నువ్వంటే మాకు.. కానీ ఎందుకు మాకు తెలుగు సినిమా తరచుగా అందించరు.. ఎందుకు ఇంత గ్యాప్​" అంటూ నాగ్ అడిగారు. దీనికి సారీ చెప్పిన సూర్య.. ఇప్పుడు ఓ మంచి సబ్జెక్ట్‌తో వస్తున్నా.. అంటూ కంగువా నుంచి తెలుగులో డైలాగ్ చెప్పారు. "నా తమ్ముడు కార్తీని చూస్తే జెలస్ అనిపిస్తుంది.. వాడు తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడా అని.. కానీ నేను నేర్చుకోవాలి" అంటూ సూర్య అన్నారు. దీనికి నువ్వు బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా.. అంటూ నాగార్జున మెచ్చుకున్నారు.

ఇక ఆ తర్వాత సూర్యకి సర్‌ప్రైజ్ ఇస్తూ కంటెస్టెంట్లు అందరూ జోడీలుగా మారి సూర్య హిట్ సినిమా సాంగ్స్‌కి డ్యాన్స్ చేశారు. ఇది చూసి సూర్య చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఆ తర్వాత కంటెస్టెం ట్లందరినీ సూర్యకి పరిచయం చేశారు నాగార్జున. వాళ్లందరితో మాట్లాడి.. "మీ ప్యాషన్ వైపు వెళ్లండి.. నచ్చింది చేయండి.. సక్సెస్ అవుతారు" అంటూ సూర్య అన్నారు. ఇక విక్రమ్ సినిమాలో రోలెక్స్ డైలాగ్ కూడా చెప్పారు. ఇక చివరిగా "తెలుగు ఆడియన్స్ ప్రేమకి ధన్యవాదాలు.. త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తాను" అంటూ ప్రామిస్ చేశారు సూర్య.

ఇక సినిమా విషయానికి వస్తే..సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కంగువా’. వినూత్నమైన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో సందడి చేయనున్నారు. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఏకంగా 38 భాషల్లో విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్స్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాను నవంబర్​ 14వ తేదీన విడుదల చేయనున్నారు.

గేమ్​ను మలుపు తిప్పిన హరితేజ - మెగా చీఫ్​గా విష్ణుప్రియ - ప్రైజ్​మనీ పెంచిన బిగ్​బాస్​!!

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు!

బిగ్​బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ,​ పృథ్వీరాజ్​ బ్రేకప్​ - అర్ధరాత్రి ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details