Kangana Emergency Movie : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. గతంలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఈ సినిమాను చూడమని ఇందిరాగాంధీ మనవరాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి చెప్పినట్లు కంగనా తాజాగా తెలిపారు. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తిక విషయాన్ని పంచుకున్నారు.
"పార్లమెంట్‌లో ప్రియాంకను ఇటీవలె కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ సినిమాను తప్పకుండా చూడమని కోరాను. దానికి ఆమె ట్రై చేస్తానని రిప్లై ఇచ్చారు. ఆమెతో ఈ సినిమా తనకు తప్పకుండా నచ్చుతుందని అన్నాను. ఇది ఓ సెన్సిటివ్ మ్యాటర్. ఇందిరాగాంధీ పాత్రను మేము ఎంతో మర్యాదపూర్వకంగా చూపించాము. రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను. ఇందిరా గాంధీకి తన భర్త, పిల్లలు, సన్నిహితులతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్నాను. శత్రువులతో ఆమె ఏ విధంగా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాను. అటువంటి విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా" అని కంగన తెలిపారు.