Kangana Ranaut Emergency :బాలీవుడ్ ఫైర్ బ్రాండ్కంగనా రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. ఈనెల 6న థియేటర్లలో రిలీజవ్వాల్సిన ఈ చిత్రం మరికొన్ని రోజులు ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇప్పటికే పలు కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ మరింత లేట్ అవ్వనుంది.
ఇక తన మూవీ పోస్ట్‌పోన్‌కు చింతిస్తూ కంగనా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసేందుతు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ అప్లోడ్ చేసింది.
"నా డైరెక్షన్లో రూపొందిన 'ఎమర్జెన్సీ' సినిమా మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి నాకెంతో బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం మేము ఇంకా ఎదురుచూస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను తేదీని ప్రకటిస్తాం. మమ్మల్ని ఇంతగా అర్థం చేసుకుంటున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చింది.
అయితే 'ఎమర్జెన్సీ' సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఆ మూవీ టీమ్ బాంబే హైకోర్టును సంప్రదించగా, అక్కడ వారికి ఊరట లభించలేదు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను తాము ఆదేశించలేమంటూ బాంబే హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.