Kalki Prelude Videos:రెబల్‌స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'కల్కీ 2898 AD' సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మూవీ రీలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మేకర్స్ తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు. ఇటీవల అమితాబ్ ఇంట్రడక్షన్, బుజ్జి (కారు), భైరవను పరిచయం చేసిన మూవీటీమ్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. ప్రేక్షకులకు సినిమాపై ఓ అంచనా వచ్చే విధంగా ఇదివరకు చెప్పినట్లుగా 'ప్రీ ల్యూడ్' వీడియోలను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో సినిమాకు సంబంధించి 5 ప్రీల్యూడ్ వీడియోలను రీలీజ్ చేయనుంది. మే 31నుంచి ఈ వీడియోలు అందుబాటులో ఉండనున్నట్లు మూవీటీమ్ చెప్పింది. అయితే ఇవి పూర్తిగా ప్రమోషనల్ పర్పస్‌గా మాత్రమే విడుదల చేస్తున్నారు. అవి అసలు సినిమాకు ఎటువంటి సంబంధం లేనివని స్పష్టం చేసింది. ఇక ప్రిల్యూడ్స్తో పాటు మరొక గ్లింప్స్ గురించి బుధవారం కీలక అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
భైరవ (ప్రభాస్), బుజ్జి (కారు)కు సంబంధించిన టీజర్లు మాత్రమే రిలీజ్ చేసిన టీమ్ మిగతాస్టార్ల ప్రమోషన్లను కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇప్పటికే చెన్నై వీధుల్లో తిరుగుతూ బుజ్జి ఫేమస్ అయిపోయింది. దీని సైజు, స్టైల్ చూసి రోడ్ మీద అందరూ ఆశ్చర్యపోతుంటే, ఇదే వీడియోను పోస్ట్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒకసారి తాము డిజైన్ చేసిన బుజ్జిని డ్రైవ్ చేయాలంటూ ట్విట్టర్ (ఎక్స్) సీఈఓ ఎలన్ మస్క్‌కు ట్వీట్ చేశారు. 'డియర్ ఎలన్ మస్క్ సర్. మా బుజ్జిని డ్రైవ్ చేయడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆరు టన్నుల బరువున్న మా బీస్, పూర్తిగా ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ ఫీట్. మీరు ఫొటో తీసి పోస్ట్ చేసుకోవడానికి కరెక్ట్ గా సరిపోతుంది' అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.