Kalki 2898AD VS Devara VS GameChanger :Kalki Devara Game Changer OTT: ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యాక వాటి రిజల్ట్ తెలిశాక శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయేవి. ఆ తర్వాత రిలీజ్ కాకముందే ఆ సినిమాకు వచ్చే క్రేజ్, కాస్టింగ్ ఆధారంగా ఛానెళ్ల మధ్య పోటీ నడిచేది. కొవిడ్ లాక్ డౌన్ వీటి అన్నిటినీ మార్చేసింది. లాక్డౌన్లో ఓటీటీలకు పెరిగిన ఆదరణ వల్ల పోటీ మరింత పెరిగింది. శాటిలైట్ రైట్స్ లాగే ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ పెరిగింది. భారీ కాస్టింగ్, బడ్జెట్‌తో పాటు ఆ సినిమాకు ఆడియెన్స్‌లో ఉండే క్రేజ్ ప్రకారం ఆ సినిమా విడుదల కాకముందే రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో పోటీ మరీ కొంటున్నాయి.
అయితే 2024లో టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాలలో కల్కి 2898 AD కూడా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్.త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ సినిమా రైట్స్ కోసం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ విపరీతంగా పోటీ పడుతున్నాయని తెలిసింది. నిర్మాతలు కనీసం 180 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారని తెలిసింది. అంత మొత్తం ఇచ్చేందుకు ఓటీటీ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయట.
ఇక అక్టోబర్‌లో విడుదల కానున్న ఎన్టీఆర్ దేవర కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. అన్ని భాషల ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ రూ.155 కోట్లకు దక్కించుకుందట. ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ. హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తోంది. మొదట ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు కానీ విలన్‌గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కు గాయం కావడంతో సినిమా అక్టోబర్ 10కు వాయిదా పడింది.