తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మాట్లాడలేక ప్రభాస్ కష్టాలు! - తెగ నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో చూశారా? - Kalki 2898AD Pre Release Event - KALKI 2898AD PRE RELEASE EVENT

Kalki 2898AD Pre Release Event Prabhas Intorvert Video : ప్రభాస్ ఇంట్రోవర్ట్​ అన్న సంగతి ముంబయిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో మరోసారి రుజువైంది. ప్రస్తుతం ప్రభాస్​కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
prabhas

By ETV Bharat Telugu Team

Published : Jun 20, 2024, 11:09 AM IST

Kalki 2898AD Pre Release Event Prabhas Intorvert Video : ప్రభాస్​ ఇంట్రోవర్ట్​ అని చాలా మంది అంటుంటారన్న సంగతి తెలిసిందే. ఆయన బయట ఈవెంట్లలో మాట్లాడటానికి కాస్త ఆలోచిస్తుంటారు. చాలా సందర్భాల్లో సిగ్గు కూడా పడుతుంటారు. ఆఖరికి తన సినిమా ప్రమోషన్స్​లోనూ తక్కువగానే మాట్లాడుతుంటారు. తాజాగా ముంబయిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లోనూ ఇది మరోసారి రుజువైంది. ఒక ఇంట్రోవర్ట్ కష్టాలు మరో ఇంట్రోవర్ట్‌కే తెలుస్తాయ్ అన్నట్టుగా ప్రభాస్​కు సంబంధించిన వీడియో ఒకటి బయట చక్కర్లు కొడుతోంది.

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఓ వైపు లెజెండ్స్​ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరోవైపు దీపికా పదుకొణె మధ్యలో ప్రభాస్​ కూర్చున్నారు. హీరో రానా హోస్ట్​గా వ్యవహరించారు. పైగా రానాకు ముంబయి ఈవెంట్లు అన్నా, ఇంగ్లీష్​ మాట్లాడటం అన్నా కొట్టిన పిండి. అందుకే ఎప్పటిలాగే తనదైన స్డైల్​లో అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకొణెను స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్​ అడిగారు. అయితే ఈ సందర్భంలోనే ఓ ఫన్నీ ఇన్సిడెంట్​ జరిగింది.

బిగ్‌బీ అమితాబ్​, కమల్, ప్రభాస్, దీపికలకు ఓ కుర్రాడు మైక్ తీసుకొచ్చి ఇచ్చాడు. మొదట ప్రభాస్​కే ఇచ్చాడు. దీంతో అప్పటివరకు ఎంతో కూల్‌గా కనిపించిన ప్రభాస్ ఆ కుర్రాడు మైక్ ఇవ్వబోతుంటే 'వీడేంటి మైక్ ఇస్తున్నాడు. మాట్లాడు అంటారేమో' అంటూ చిన్నపాటి ఎక్స్​ప్రేషన్​తో కనిపించారు. సర్లే ఆ మైక్​ను దీపికకు ఇద్దామని అనుకునేలోపు ఆ కుర్రాడు మరో మైక్​ను దీపికకు ఇచ్చాడు. దీంతో 'ఈమెకు ఇచ్చేద్దాం. అయ్యో ఆల్‌రెడీ ఇచ్చేశారా' అంటూ కమల్‌ హాసన్‌కి ఇద్దామని ప్రభాస్ ట్రై చేశారు. కానీ కమల్‌కు కూడా మైక్ ఇచ్చేయడం వల్ల 'సర్లే ఇక ఏదోలా మేనేజ్ చేద్దాం' అన్నట్లుగా ఎక్స్​ప్రెషన్ పెట్టారు ప్రభాస్​. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ పాన్ ఇండియా స్టార్ అయినా నువ్వు సాదాసిదా డార్లింగ్​వే, ఇంట్రోవర్ట్​వే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్​ 27న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్​లో టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

స్టేజ్​పైనే తెలుగు నిర్మాత పాదాలు తాకిన అమితాబ్!

'ప్రభాస్ వల్లే ఇలా అయ్యాను' : దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్!

ABOUT THE AUTHOR

...view details