తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్ కాలికి గాయం ఇంకా తగ్గలేదా? - వీడియో వైరల్! - Prabhas Kalki 2898 AD - PRABHAS KALKI 2898 AD

Kalki 2898AD Prabhas Leg Injury : గతంలో ప్రభాస్​కు​ గాయమవ్వడం వల్ల కాలికి సర్జరీ చేయించుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్​కు ఆ గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదని తెలుస్తోంది! పూర్తి వివరాలు స్టోరీలో

source ANI
kalki (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 9:36 AM IST

Kalki 2898AD Prabhas Leg Injury: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా మరో రెండు రోజుల్లో జూన్ 27న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్​ యాక్టర్స్​ కీలక పాత్రల్లో నటించడం, పైగా ట్రైలర్స్​లో కనిపిస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్​తో చిత్రంపై వీర లెవల్​లో అంచనాలు పెరిగిపోయాయి. అడ్వాన్స్​ బుకింగ్స్​లోనూ టికెట్ రేట్స్​ హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీంతో ప్రభాస్ కచ్చితంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రభాస్​ ఫ్యాన్స్‌ను కాస్త బాధపెడుతోంది.

అదేంటంటే? - ప్రభాస్ కాలికి గాయం ఇంకా మానలేదని తెలుస్తోంది. రీసెంట్​గా ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్​గా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మూవీ స్టార్ కాస్ట్​ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె సహా నిర్మాతలు హాజరై సందడి చేశారు. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

ప్రభాస్ కూడా చాలా ఫన్నీగా, నవ్వుతూ యాక్టివ్‌‍గానే కనిపించారు. పైగా ప్రభాస్‌ను అమితాబ్ ఆటపట్టించడం, దీపికను ప్రభాస్​ ఆటపట్టించడం చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరో షార్ట్​ వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఇందులో స్టేజ్​పై దీపికా పదుకొణె, ఆ పక్కనే ప్రభాస్ నిల్చొని కనిపించారు. మరి ఆ సమయంలో ఏమైందో పక్కాగా తెలీదు కానీ ఒక్క సెకన్​ పాటు ప్రభాస్ కాస్త వెనక్కి తుళ్లిపడినట్లు కనిపించింది. దీంతో ఆ వీడియో చూసిన వారంతా ప్రభాస్ కాలికి నొప్పి ఇంకా తగ్గలేదని, ముఖంలోనూ నొప్పి బాధ కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. కానీ ప్రభాస్​ నవ్వుతూనే కవర్ చేశారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు!

వాస్తవానికి బాహుబలి చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ కాలికి గాయమైందని, ఆ తర్వాత సాహో, సలార్ షూటింగ్ సమయంలో కూడా కాలికి గాయమైందని ప్రచారం సాగింది. సలార్ షూటింగ్ సమయంలో స్పెయిన్‌లో ఆయన కాలికి సర్జరీ కూడా చేయించుకున్నారని వార్తలొచ్చాయి. రెండు నెలల పాటు విశ్రాంతి కూడా తీసుకున్నట్లు చెప్పారు. అయినా కూడా ఇది సెట్ అవ్వలేదని అభిమానులు అంటున్నారు.

'కల్కి' టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - ఎంత పెరిగాయంటే?

'ఉలఝ్' - దేశద్రోహం కేసు నుంచి జాన్వీ ఎలా బయటపడింది!?

ABOUT THE AUTHOR

...view details