Prabhas Sandeep Vanga Spirit Movie : 'యానిమల్' సినిమాతో పాన్ ఇండియా హిట్‌ను ఖాతాలో వేసుకున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. 'స్పిరిట్' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను దాదాపు ఎనిమిది భాషల్లో టీ-సిరీస్ నిర్మించనుంది. ప్రభాస్ 25వ సినిమాగా రాబోతుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్(Kalki 2898 AD Review) అందుకుని ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉన్నారు. ఇందులో బైరవ పాత్రలో యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు.
అయితే ఈ చిత్రం తర్వాత ఆయన ఏ చిత్రంలో నటిస్తారా అని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రీసెంట్గా ప్రభాస్ ముంబయిలో ఉండగా సందీప్ రెడ్డి వంగా ఆయన్ను కలిసి స్పిరిట్ సినిమాలోని రెబల్ స్టార్ పాత్ర గురించి చర్చించారట. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించాల్సి ఉండటంతో బాగా ఫిట్‌గా, కాస్త సన్నగా కనిపించాలని సూచించారట. ప్రస్తుతం 44 ఏళ్ల వయస్సున్న ప్రభాస్ 30 ఏళ్ల వయస్సున్న వ్యక్తిలా కనిపించాలని, పూర్తిగా బాడీ షేప్ కూడా మార్చాలని చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం బయట చక్కర్లు కొడుతోంది. దీన్ని తెలుసుకుంటున్న ఫ్యాన్స్ స్పిరిట్లోని ప్రభాస్ లుక్‌పై అంచనాలు పెంచేస్తూ ఆయన సన్నగా ఉన్నట్లు డిజైన్ చేసిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.