Most Popular Hero Prabhas : ప్రస్తుతం కల్కి 2898 ఏడీ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే తాజాగా ఇప్పుడు ప్రభాస్ మరో ఘనతను సాధించారు. మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు విశ్లేషించి, సర్వేలు చేసి టాప్ మోస్ట్ సినిమా, సిరీస్, నటీనటుల వివరాలను విడుదల చేస్తుంటుంది. అలా తాజాగా ఆర్మాక్స్ జూన్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ టాప్ పొజిషనల్లో నిలిచారు.
మే నెలలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభాస్ జూన్‌లోనూ అదే స్థానంలో కొనసాగారు. ప్రభాస్ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. ఇక ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. గేమ్ ఛేంజర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్ చరణ్ ఈ సారి తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి మూడో స్థానంలో, ఆరో స్థానంలో మహేశ్ బాబు ఉన్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఏడు, ఎనిమిది, పది స్థానాల్లో కొనసాగుతున్నారు.