Kalki 2898 AD OTT:రెబల్ స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి' వరల్డ్‌వైడ్‌గా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. జూన్ 27న రిలీజైన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు కొట్టగొట్టింది. అయితే ఇన్నిరోజులు థియేటర్లలో అలరించిన కల్కి ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. మరి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?
కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఆగస్టు 23నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే థియేటర్ వెర్షన్ కాకుండా సినిమాను కాస్త ట్రిమ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అసలు రన్‌టైమ్‌లో దాదాపు 6నిమిషాల ఫుటేజీ కట్ చేయనున్నారని సమాచారం. అయితే ఓటీటీ రిలీజ్, రన్‌టైమ్ గురించి ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
షారుక్ సినిమా రికార్డ్ బ్రేక్
'కల్కి 2898 AD' చిత్రం 2024 సంవత్సరంలో విడుదలైన అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. రిలీజ్ నుంచి ఆదరణ పొందుతూ కొత్త కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో సినిమా అన్ని దేశవ్యాప్తంగా భాషల్లో కలిపి రూ.760కోట్లుకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా ఆల్ టైమ్ ఇండియా కలెక్షన్స్ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌లో 'జవాన్' సినిమా ఆల్ టైమ్ కలెక్షన్స్ రూ.760కోట్లు. అంతేకాదు భారతీయ చలనచిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా 'కల్కి 2898 AD' నిలిచింది. గతంలో 'బాహుబలి- 2', 'KGF-2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు ఈ ఫీట్ సాధించాయి.