Kalki 2898 AD Nag Ashwin Vijay Devarkonda Old look : 'కల్కీ 2898 ఏడీ' - ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. కారణం భారీ రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్‌తో పాటు మరికొంతమంది గెస్ట్ రోల్స్ చేశారు. వారిలో విజయ దేవరకొండ ఒకరు. ఆయన్న అర్జునుడిగా చూపించారు నాగ్. అయితే ప్రస్తుతం వీరిద్దరి ఫ్రెండ్ షిప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరు కలిసి దిగిన ఓల్డ్ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో నాగ్ అశ్విన్ చాలా బక్కగా, పెద్ద జుట్టుతో ఉన్నారు. విజయ్ దేవరకొండ కూడా చిన్న పిల్లాడిలా, సన్నగా కనిపించారు. ఏదో పార్టీలో ఆ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. అయితే నాగ్ అశ్విన్‌ను చూసిన వారంతా వెరైటీగా ఉన్నాడే అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, నాగ్ అశ్విన్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, రెండో చిత్రంలో మహానటిలోనూ విజయ్ దేవరకొండ నటించారు.