Kalki 2898 AD Mahashivratri Special Poster :రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది మే 9న విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే వచ్చిన టీజర్, స్పెషల్ పోస్టర్లు ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మహశివారాత్రి పండుగను పురస్కరించుకుని తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ న్యూ లుక్తో పాటు తన పాత్ర పేరును రివీల్ చేశారు. కాశీ భవిష్యత్ వీధుల్లో నుంచి, 'కల్కి 2898 ఏడీ' భైరవను మీకు పరిచయం చేస్తున్నాం. అంటూ ఓ సాలిడ్ క్యాఫ్షన్ను రాసుకొచ్చారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. ప్రభాస్ గురించి ఇలాంటి సూపర్ అప్డేట్ ఇచ్చినందుకు సంబరపడుతున్నారు.
మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి షూటింగ్ లొకేషన్లో ప్రభాస్, దిశా పటానీ కలిసి దిగిన ఫొటోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో ప్రభాస్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఇద్దరూ నవ్వుతూ ఫొటోకు పోజులివ్వగా, ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.