Kalki 2898 AD First Award :అంచనాలకు మించి బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తోంది 'కల్కి 2898 ఏడీ'. బ్లాక్‌బస్టర్ టాక్‌తో రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డులు రావడం ఖాయం అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అభిమానుల మాటలకు ముందడుగు ఇప్పుడే పడింది. కల్కి సినిమాకు తొలి అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ అవార్డులకు ఇంకా సమయం ఉందనే ఉద్దేశమో ఏమోగానీ, తెలుసు స్టార్ హీరో ఒకరు 'కల్కి'కి అవార్డు ఇచ్చేశారు. ఈ విషయం చెబుతూ, దీనికి సంబంధించిన ఫొటో షేర్ చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ మేపరకు సోషల్ మీడియాలో ఆ అవార్డు ఫొటో పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. 'ఇది కల్కికి వచ్చిన తొలి అవార్డు' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ జోడించారు. అయితే ఆ అవార్డు ఇచ్చిన నటుడు ఎవరో కాదు, మన భల్లాల దేవుడు రానా దగ్గుబాటి. డైరెక్టర్ పోస్ట్‌పై స్పందించిన రానా 'కల్కి'కి మరిన్ని పురస్కారాలు వస్తాయని అశాభావం వ్యక్తం చేశారు.
వసూళ్లు ఎంతంటే?
జూన్ 27న రిలీజ్ అయిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ మూడు రోజుల్లో రూ.415 కోట్లుకుపైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ఆదివారం ప్రకటించింది. విడుదలైన రోజు నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ బాబు, అల్లు అర్జున్ తదితరులు 'కల్కి' ఓ అద్భుతమని పేర్కొన్నారు. విజువల్స్ పరంగానే కాదు కామియో రోల్స్‌తోనూ ఈ మూవీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ తదితరులు ఈ సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించడం విశేషం.