JR NTR With Mother:గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి ఉడుపి (కర్ణాటక) శ్రీకృష్ణ ఆలయాన్ని శనివారం దర్శించారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో దిగిన ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దర్శనంతో తన తల్లి కల నెరవేరిందంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆయన వెంట డైరెక్టర్ ప్రశాంత్ నీల్, జాతీయ అవార్డు విజేత రిషబ్‌శెట్టి కూడా ఉన్నారు.
'అమ్మ ఎప్పుడూ నన్ను తన సొంతూరు కుందాపురాతో పాటు, ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేయించాలని కల కంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ కల నిజమైంది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజు ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి ఇదే. విజయ్ కిరంగదూర్ సర్ మీకు ధన్యవాదాలు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే రిషబ్‌శెట్టి కూడా వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు' అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
ఎన్టీఆర్- నీల్ సినిమా స్టార్ట్!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ రీసెంట్గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కానీ, షూటింగ్, తదితర విషయాలపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నిర్మాత రవి శంకర్ ఈ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక ఎన్టీఆర్ డిసెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటారని పేర్కొన్నారు.