Joker : Folie a Deux New Poster : హాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జోకర్' సినిమా గురించి చాలా మంది సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. 2019లో విడుదలైన ఈ చిత్రం అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినీ ప్రియుల్ని ఎంతగానో మెప్పించింది. ముఖ్యంగా సినిమాలో జోకర్‌గా నటించిన ఫినిక్స్ తన నటనతో సినీ ప్రేక్షకులను ఫిదా చేశాడు.
అయితే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. జోకర్: ఫోలి అ దు పేరుతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా ఇది రానుంది. టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ విడుదల చేసింది. 'ఈ ప్రపంచం ఓ వేదిక' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ముఖంపై రక్తంతో - ఈ సినిమాలో అథుర్ ఫ్లెక్ అలియాస్ జోకర్ పాత్రలో జోక్విన్ ఫినిక్స్, హార్లే క్విన్ పాత్రలో ప్రముఖ హాలీవుడ్ కథానాయిక, పాప్ సింగర్ లేడీ గాగా నటించారు. వీరిద్దరు తాజాగా విడుదలైన కొత్త పోస్టర్లో ముఖంపై రక్తంతో, కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచుతోంది.