తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తెలుగులో రీమేక్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ - హీరోగా టాలీవుడ్ డైరెక్టర్​! - Jaya Jaya Jaya Jaya Hey Movie - JAYA JAYA JAYA JAYA HEY MOVIE

Jaya Jaya Jaya Jaya Hey Movie : మలయాళ సూపర్ హిట్ జయ జయ జయ జయహే సినిమా తెలుగులో రీమేక్ కాబోతుందని తెలుస్తోంది. ఇందులో ఓ ప్రముఖ డైరెక్టర్​ లీడ్​ రోల్​లో నటించబోతున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

తెలుగులో రీమేక్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ - హీరోగా టాలీవుడ్ డైరెక్టర్​!
తెలుగులో రీమేక్ కానున్న మలయాళ సూపర్ హిట్ మూవీ - హీరోగా టాలీవుడ్ డైరెక్టర్​!

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 3:32 PM IST

Jaya Jaya Jaya Jaya Hey Movie : మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేచురాలిటికీ దగ్గరగా ఉత్కంఠగా సాగుతూ పోతుంటాయి. పైగా ఈ మధ్యలో మలయాళ నుంచి వచ్చే ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్​ను అందుకుంటోంది. రీసెంట్​గా భ్రమయుగం, ప్రేమలు, ముంజుమ్మెల్ బాయ్స్​, ఆవేశం ఇలా అన్నీ వరుస హిట్లే. ఇవి(ఆవిశేం మినహా) తెలుగులోనూ రిలీజై ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మరో చిత్రం అలరించేందుకు రెడీ అవుతోంది. కానీ అది డైరెక్ట్​ మూవీ కాదు. అక్కడ సూపర్ హిట్ అందుకుని ఇక్కడ తెలుగులో రీమేక్ కాబోతుంది.

ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? - జయ జయ జయ జయహే సినిమా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. 2022లో వచ్చిన ఈ చిత్రంలో బాసిల్ జోసెఫ్‌, ద‌ర్శ‌న‌రాజేంద్ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. విపిన్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని అందుకుంది. తక్కువ(రూ.5 కోట్లు) బడ్జెట్​తో తెరకెక్కి రూ. 45 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ అందుకుంది. ఓటీటీలోనూ తెలుగులో వచ్చి బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో జ‌య పాత్ర‌లో ద‌ర్శ‌న‌ రాజేంద్ర‌న్ త‌న నటనతో ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. భ‌ర్త పెట్టే చిత్ర‌హింస‌ల‌ను భ‌రించ‌లేక అత‌డిపై ఎదురుతిర‌గే భార్య పాత్ర‌లో అదరగొట్టేసింది.

ఇప్పుడీ చిత్రాన్నే తెలుగులో రీమేక్​ చేయబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్​లో హీరోయిన్‌గా నటించిన దర్శన రాజేంద్రనే ఈ రీమేక్​లోనూ నటించి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఆమె భర్త పాత్రలో పోషించబోతున్నట్లు సమాచారం అందింది. అంటే తరుణ్ భాస్కర్​ లీడ్ రోల్ చేయబోతున్నారు. ఇప్పటివరకు ఆయన ఇతర హీరోల చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తొలిసారి ఆయనే లీడ్​ రోల్ చేయబోతున్నారు.

కాగా, ఈ మధ్యే చాలా గ్యాప్ త‌ర్వాత కీడాకోలా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు త‌రుణ్ భాస్క‌ర్‌. క్రైమ్ కామెడీ బ్యాక్​డ్రాప్​తో వచ్చిన ఈ మూవీ ప‌ర్వాలేద‌నిపించింది. అలానే వెబ్​సిరీస్​ల్లోనూ నటిస్తున్న ఆయన ఆ మధ్య వచ్చిన దూత వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్ రోల్ చేరి ఆకట్టుకున్నారు. ఇంకా మంగ‌ళ‌వారం, దాస్ కీ ధ‌మ్కీతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో నటించారు.

కన్నప్పలో ప్రభాస్​ శివుడు కాదట - ఏ పాత్రలో కనిపించనున్నారంటే? - Prabhas Kannappa

లారెన్స్ ట్రిపుల్​ ధమాకా - వెరీ ఇంట్రెస్టింగ్​గా లైనప్​! - Raghava Lawrence Upcoming Movies

ABOUT THE AUTHOR

...view details