Janhvi Kapoor Trolls :ఇటీవలే సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్పందించింది. ఓ ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఆమెపై వచ్చిన ట్రోల్స్ గురించి తన సోదరి చెప్పేంతవరకు తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజా ఆమె అప్‌కమింగ్ మూవీ 'ఉలఝ్' ప్రమోషన్స్‌లో ఈ విషయం గురించి మాట్లాడింది.
"నాకు సోషల్ మీడియా అంటే భయం. దానికి నేను ఎప్పుడూ దూరంగానే ఉంటాను. ఆ వెబ్సైట్లో నిన్ను చాలా ట్రోల్ చేస్తున్నారు అక్క అని ఖుషీ చెప్పేంతవరకు వరకు నాకు తెలియదు. వాటిన్నింటినీ చూశాక నాకు ఎలా స్పందించాలో అస్సలు అర్థంకాలేదు. అందులో పలు దారుణమైన ట్రోల్స్ కూడా కనిపించాయి. అయితే అటువంటి వాటిని నేను అస్సలు పట్టించుకోను" అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా, గతంలోనూ ఆన్లైన్ వేదికగా స్టార్ కిడ్స్ ఎదుర్కొంటున్న కామెంట్ల గురించి పలుసార్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
" సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, కామెంట్స్‌ను మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సామాజిక మాధ్యమాల కల్చరే అది. నువ్వు సెలబ్రిటీ అయినా, కాకపోయినా ఇటువంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఆ కామెంట్స్‌ను అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనల్ని పొగిడిన వాళ్లే, రేపు తిడతారు. మనకు తెలియని వ్యక్తులు మనల్ని ఏదో అన్నారని ఇంట్లో కూర్చొని ఏడవటం ఎందుకు" అని జాన్వీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఇక 'ఉలఝ్' విషయానికి వస్తే, నేషనల్ అవార్డు విన్నర్ సుధాంశు సరియా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాన్వీ ఇందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) ఆఫీసర్ కనిపించనుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 2న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతానికి ఇది డీసెంట్ టాక్ అందుకుంటోంది.
'ఆ పని నేర్చుకునేందుకు ఎన్టీఆర్‌కు ఒక్క సెకను - నాకైతే 10 రోజులు' - Janhvi Kapoor Jr NTR
ఆస్పత్రి నుంచి జాన్వీ డిశ్చార్జ్- ఇప్పుడెలా ఉందంటే? - Janhvi Kapoor Discharged