Janhvi Kapoor Marriage :బాలీవుడ్ హీరోయిన్ అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి తెలిసిందే. స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆమె వరుస ఈవెంట్లలోనూ పాల్గొంటోంది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న జాన్వీ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలిపింది.
"అతడు నా కలలను తన కలలుగా భావించాలి. నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ నన్ను సంతోషంగా చూసుకోవాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ఓదార్చాలి. అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది. కాగా, జాన్వీ గత కొంత కాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్‌తో రిలేషన్షిప్లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. రీసెంట్గా మైదాన్ మూవీ ప్రీమియర్ షోలోనూ ఆమె శిఖు (శిఖర్ పహాడియా) అనే లోగో ఉన్న నెక్లెస్ వేసుకుంది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలానే ఓ సందర్భంలో తన ఫోన్లో స్పీడ్ డయల్ లిస్ట్‌లో తన తండ్రి, చెల్లి, శిఖర్ పేర్లు ఉంటాయని చెప్పింది. దీంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.