Janhvi Kapoor Net Worth :అందాల నటి శ్రీదేవి తనయగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీజాన్వీ కపూర్. సినీ నేపథ్యంలో వచ్చినప్పటికీ తన ట్యాలెంట్‌తో మంచి మంచి ఆఫర్లు అందుకుని బీటౌన్‌లో దూసుకెళ్తోంది. త్వరలో టాలీవుడ్‌లోనూ సందడి చేయనుంది. అయితే ఈ అమ్మడి గురించి సినిమాల పరంగా చాలా మందికి తెలుసు. కానీ ఈమె నెట్‌వర్త్ గురించి అంతగా తెలీదు. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ టాప్ 5 ప్రాపర్టీస్ గురించి ఓ లుక్కేద్దామా.
ముంబయిలో రూ.65 కోట్ల డూప్లెక్స్
రాజ్ కుమార్ రావ్ దంపతులకు 2022లో జులై రూ.44 కోట్ల విలువైన ఓ లగ్జరీయెస్ ట్రిప్లెక్స్ బిల్డింగ్‌ను అమ్మేసిన తర్వాత జాన్వీ బాంద్రాలో రూ.65 కోట్ల డూప్లెక్స్ కొనుగోలు చేసింది. 8669 స్కేవర్ ఫీట్ ఉన్న ఆ ప్రాపర్టీలో ఓ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందట.
చెన్నైలో అత్యంత ఖరీదైన బంగ్లా
ముంబయిలో ఉన్న కొత్త డూప్లెక్స్ బంగ్లా తర్వాత జాన్వీ వాళ్ల ఫ్యామిలీ చెన్నైలోని నాలుగు ఎకరాల్లో విలాసవంతమైన ఓ ఇల్లు కట్టుకున్నారు. ఇది ఆమె తల్లి శ్రీ దేవి ప్రేమగా కట్టించుకున్న ఇళ్లు. ఇందులో ఓ స్విమ్మింగ్ పూల్, గార్డెన్, ఆర్ట్స్‌తో కూడా గ్యాలరీ లాంటిని స్పెషల్ అట్రాక్షన్‌గా ఉన్నాయి. శ్రీదేవీ మరణాంతరం ఆయన భర్త బోనీ కపూర్ ఈ ఇంటిని రెనోవేట్ చేసి మరింత చక్కగా తీర్చిదిద్దారు.
మెర్సిడీజ్ మేబాచ్
జెర్మెన్ సీడన్ అయిన మెర్సిడెస్ మేబాచ్ బాలీవుడ్ లోని చాలా తక్కువ మంది సెలబ్రిటీలు వాడుతుంటారు. ఇండియన్ మార్కెట్ లో దీని విలువ రూ.1.94 కోట్లు. సీట్ మసాజర్లు, మినీ ఫ్రిడ్జ్, పానోరామిక్ సన్ రూఫ్, ప్రకాశవంతమైన లైటింగ్ తో పాటు మరెన్నో ఫీచర్లు ఇందులో ఉంటాయట.
బీఎండబ్ల్యూ ఎక్స్5
జాన్వీ కపూర్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ ఎక్స్5 కూడా ఉంది. ట్విన్‌పవర్ టర్బో వీ8 ఇంజిన్‌తో, స్మూత్ రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. 6.5 సెకన్లలో 0-100 స్పీడ్ వెళ్లగలదు.