తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆస్పత్రి నుంచి జాన్వీ డిశ్చార్జ్- ఇప్పుడెలా ఉందంటే? - Janhvi Kapoor Discharged - JANHVI KAPOOR DISCHARGED

Janhvi Kapoor Discharged : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్​ తాజాగా మీడియాతో చెప్పారు. ఇంతకీ ఏమైందంటే?

Janhvi Kapoor Discharged
Janhvi Kapoor (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 10:47 AM IST

Janhvi Kapoor Discharged :బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్‌ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యిందని ఆయన తండ్రీ బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఊంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. "ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా జాన్వీ అస్వస్థతకు గురైంది. గురువారం ఈ ఘటన జరగ్గా మేము ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. అక్కడ చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడ్డాక నిన్న ఉదయం జాన్వీని ఇంటికి తీసుకొచ్చాం"అంటూ బోనీ కపూర్‌ తాజాగా మీడియాతో చెప్పారు.

అసలేం జరిగిందంటే?
గతకొంత కాలంగా బిజీ షెడ్యూల్స్​ గడుపుతున్న జాన్వీ, జులై 18న అస్వస్థతకు గురైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు జాన్వీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆమె ఫుడ్ పాయిజన్‌‌కు గురైనట్టు డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. దీంతో చికిత్స తర్వాత ఇప్పుడు డిశ్చార్జ్​ అయ్యింది.

జాన్వీ డిశ్చార్జ్ అయ్యిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమె కోలుకున్నందున సంతోషిస్తున్నారు. స్పీడ్​గా రికవర్ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరగా మిమ్మల్ని షూటింగ్ స్పాట్​లో చూడాలంటూ కోరుకుంటున్నారు.

ఇటీవలే జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్​ మాహీ' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరిచింది. కలెక్షన్ల పరంగా కాస్త ఫర్వాలేదనిపించింది.

మరోవైపు జాన్వీ 'దేవర'తో పాటు 'ఉలఝ్​', 'సన్నీ సంస్కారీకి తులసీకుమారీ' ఇలా మూడు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో రెండూ షూటింగ్​ జరుపుకుంటుండగా, మరొకటి మాత్రం పోస్ట్​ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

తాజాగా అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుకల్లో ఈమె స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్​తో పాటు పెళ్లిలోనూ యాక్టివ్​గా పాల్గొని సందడి చేసింది. తన సోదరి ఖుషి కపూర్​, అలాగే రూమర్డ్​ బాయ్​ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఎంజాయ్​ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అంతేకాకుండా ఈ వేడుకల కోసం జాన్వీ ధరించిన డిజైనర్ దుస్తులు కూడా ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకర్షించాయి.

'ఉలఝ్' - దేశద్రోహం కేసు నుంచి జాన్వీ ఎలా బయటపడింది!?

గ్యారేజ్ నిండా కార్స్​ - ముంబయిలో రూ.65 కోట్ల డూప్లెక్స్ హౌస్ - జాన్వీ నెట్​వర్త్ ఎంతంటే? - Janhvi Kapoor Net Worth

ABOUT THE AUTHOR

...view details