తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జాన్వీ మెడలో బాయ్​ఫ్రెండ్​ పేరుతో డైమెండ్ నెక్లస్​ - మళ్లీ దొరికేసింది! - Janhvi Kapoor Boyfriend - JANHVI KAPOOR BOYFRIEND

Janhvi Kapoor Boyfriend : బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన రిలేషన్​షిప్ స్టేటస్​ గురించి మరోసారి ఇండైరెక్ట్​గా హింట్ ఇచ్చింది. తన డైమెండ్ నెక్లెస్ మీద బాయ్​ఫ్రెండ్ పేరు ఉండేలా డిజైన్ చేయించుకుంది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 1:26 PM IST

Janhvi Kapoor Boyfriend :బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు షికర్ పహరియాతో డేటింగ్​లో ఉన్నట్లు మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ మరోసారి జాన్వీ మీడియాకు దొరికింది.

తాజాగా తండ్రి బోణి కపూర్ నిర్మించిన మైదాన్ సినిమా ప్రమోషన్స్​లో ప్యాంట్ సూట్ వేసుకుని మీడియా ముందుకు వచ్చింది జాన్వీ. అయితే ఈ ప్రెస్ మీట్​లో జాన్వీ డ్రెస్ కన్నా ఆమె మెడలో వేసుకున్న డైమెండ్ నెక్లెస్ మీద అందరి ఫోకస్ పడింది. ఎందుకంటే దానిపై 'షికు' పేరు ఉండటాన్ని అందరూ ఎక్కువగా గమనించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారిపోయింది. కాగా, జాన్వీ మొదటిసారిగా 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రాంలో తన స్పీడ్ డైల్ లిస్ట్​లో ఎవరు ఉంటారు అన్న ప్రశ్నకు తండ్రి పేరు, చెల్లి పేరు, షికర్ పేరు చెప్పింది. అయితే ఆ వెంటనే చెప్పాల్సిన దానికన్నా ఎక్కువ చెప్పానని అర్థం చేసుకోండంటూ ఆ మాటను దాటేసింది.

ఇక జాన్వీ, షికర్ ఇద్దరూ కలిసి తరుచుగా గుళ్లకు వెళ్తూ మీడియా కంటికి చిక్కుతూనే ఉన్నారు. రీసెంట్​గా కూడా వీరిద్దరూ కలిసి సంప్రదాయ దుస్తులలో తిరుమల కూడా వచ్చారు. కానీ తమ మధ్య ఉన్న బంధం గురించి మాత్రం పెదవి విప్పలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య సమ్​థింగ్ సమ్​థింగ్ ఉందంటూ రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది.

ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలోనూ బోనికపూర్ మాట్లాడుతూ - "అతను(షికర్) నాకు చాలా నచ్చుతాడు. అతడి స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. నా కోసం, జాన్వీ కోసం, అర్జున్ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండడం మా అదృష్టం" అంటూ షికర్​ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ దేవర సినిమాలో ఎన్టీఆర్​కు జోడిగా నటిస్తోంది. రామ్​చరణ్ ఆర్​సీ 16లోనూ హీరోయిన్​గా ఫిక్స్ అయింది.

ABOUT THE AUTHOR

...view details