Jai Hanuman sequel Star Hero : సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జా కథానాయకుడిగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా 'జై హనుమాన్' రానున్నట్లు దర్శకుడు ప్రశాంత్ ఇప్పటికే క్లారిటీ చేశారు. అయితే తాజాగా ఈ సీక్వెల్‌ను ఉద్దేశించి ప్రశాంత్ వర్మ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీక్వెల్‌లో తేజ హీరో కాదని స్పష్టత ఇచ్చారు. 'హనుమాన్' సక్సెస్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని షేర్ చేశారు.
"హనుమాన్ కన్నా వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్' ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ ఆయన హనుమంతు పాత్రలో కనిపిస్తారు. ఈ సీక్వెల్ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తారు. 2025లో ఇది రిలీజ్ అవుతుంది. దీని కన్నా ముందు నా నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి 'అధీర'. మరొకటి 'మహాకాళి' అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. టీమ్ సహకారంతోనే తాను ఈ భారీ విజయాన్ని అందుకోగలినట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే ఈ జై హనుమన్ సీక్వెల్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏ స్టార్ హీరో నటిస్తారో.
ఇకపోతే ఈ హనుమాన్ సినిమా బడ్జెట్ రూ.30కోట్ల లోపే అని అంటున్నారు. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.200 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.